జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై( Pawan Kalyan ) వినిపించే విమర్శల లో ఆయన వ్యక్తిగత వ్యవహారం పై విమర్శలు పక్కన పెడితే ప్రదానమైనది ఆయన పార్ట్ టైం పొలిటిషన్ అని కేవలం సినిమాల మధ్య గ్యాప్ లో మాత్రమే రాజకీయాలు చేస్తారు తప్ప ఆయనకు ఆంధ్ర రాజకీయాలపై( AP Politics ) చిత్తశుద్ది లేదంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి .పరాయి రాష్ట్రం లో ఉన్న ఆయనకు ఆంధ్రా రాజకీయాల తో ఏమి పని అని కూడా విమర్శలు వచ్చేవి .
అయితే తన వారాహయాత్రతో ఆ విమర్శలకు కొంత వరకు చెక్ పెట్టినప్పటికీ ఇప్పుడు పూర్తిస్థాయిలో వాటికి మంగళం పాడాలని పవన్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది .దాంతో ఆయన తన కేరాఫ్ అడ్రసు ని మంగళగిరి కి మారుస్తున్నారట.
ఇకపై కార్యకర్తలకు పూర్తి సమయం అందుబాటులో ఉండాలని పవన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.హైదరాబాదులో ఉన్న పార్టీ కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో మంగళగిరి కార్యాలయానికి( Mangalagiri ) తరలించినట్లుగా తెలుస్తుంది .ఇక తన నివాసాన్ని కూడా మంగళగిరిలోనే ఏర్పాటు చేసుకుంటారని, పూర్తిస్థాయిలో రాజకీయ కార్యక్రమాలకు అందుబాటులో ఉండాలని పవన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది .ఇక తన సినిమా షెడ్యూలు ఉన్నప్పుడు మాత్రమే పవన్ ఆంధ్ర ప్రదేశ్ ను దాటి వెళ్తారని లేకపోతే పూర్తిస్థాయిలో పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండి స్థానిక నేతలతో సమావేశం అవుతారని జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.
తమ నాయకుడు పార్ట్ టైం లో అందుబాటులో ఉంటేనే అధికార పార్టీకి చుక్కలు కనిపిస్తున్నాయని ఇప్పుడు పూర్తిస్థాయిలో ఆయన రాజకీయాలపై ఫోకస్ పెడితే అధికారి పార్టీ తట్టుకోలేదంటూ కూడా జన సైనికులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు .అయితే తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పై హర్షం వ్యక్తం అవుతుంది రాజకీయ నాయకుడనేవాడు ఎప్పుడో ఒకసారి వచ్చి కంటి తుడుపు చర్యలు చేసేలా కాకుండాతన సమయాన్ని ప్రజలకు కేటాయించినప్పుడే ప్రజలు ఆ నాయకుడ్ని నమ్ముతారని పవన్ ఇప్పటికైనా అలాంటి నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ఆయనకు మంచి ఫలితాలు ఇస్తుందంటూ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.