దిల్ రాజు రాకతో నిర్మాతల మండలిలో వచ్చే మార్పులు ఏంటో?

తెలుగు సినిమా నిర్మాతల మండలి( Telugu Film Producer Council ) అనేది ఒకటి ఉంటుందని కొన్ని సంవత్సరాల క్రితం చాలా మందికి తెలియదు.ఎందుకంటే ఆ సమయంలో నిర్మాతల మండలి హడావుడి ఎక్కువగా ఉండేది కాదు.

 Dil Raju Is The New Producer Council President,dil Raju,telugu Film Producer Cou-TeluguStop.com

కానీ ఇప్పుడు నిర్మాతల మండలి చాలా యాక్టివ్ అయింది.ఒకప్పుడు మండలి అధ్యక్షులుగా చిన్న నిర్మాతలు ఉండేవారు.

కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.చిన్న నిర్మాతలు కేవలం చిన్న సినిమాల( Small budget Movies ) గురించే మాట్లాడుతున్నారు తప్ప పెద్ద సినిమాల విషయంలో ఇబ్బందులు వచ్చినప్పుడు మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు అనే ఆరోపణ ఉంది.

అందుకే ఇప్పుడు పెద్ద నిర్మాతలు ఆ పీటం పై దృష్టి పెట్టారు అనేది టాక్‌.

అందులో భాగంగానే దిల్ రాజు( Dil Raju ) ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం తో పాటు మంచి మెజార్టీ తో గెలుపొందారు.నిర్మాతల మండలి ఎన్నికల్లో దిల్ రాజు( Dil Raju Won As Telugu Film Chamber President ) సత్తా చాటడంతో ముందు ముందు మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దిల్ రాజు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమా లను కూడా నిర్మిస్తూ ఉంటాడు.

కనుక ఆయన అన్ని వర్గాల వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాతలు ముఖ్యంగా చిన్న నిర్మాతలు( Small Producers ) ఎదుర్కొంటున్న పారితోషికం ఇతర ప్రత్యేక అలవెన్స్ ల విషయం లో దిల్‌ రాజు తప్పకుండా మంచి నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా కొందరు నమ్ముతున్నారు.మొత్తానికి దిల్ రాజు నుండి చాలా మార్పులు రావచ్చు అంటున్నారు.దిల్ రాజు మరియు ఆయన ప్యానల్ మెంబర్స్( Dil Raju Panel Members ) అంతా కూడా కాస్త పెద్ద సినిమాలను చేసిన వారే.

అందుకే చిన్న పెద్ద సినిమాలకు ఉపయోగదాయకంగా వారు ఉంటారు అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube