Anupama Parameswaran : బన్నీ గురించి అటువంటి కామెంట్స్ చేసిన అనుపమ.. ఓ రేంజ్ ఆడుకుంటున్న నెటిజన్స్?

టాలీవుడ్ నటి కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) తొలి చూపులతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

 Anupama Made Such Comments About Bunny Are The Netizens Playing A Range-TeluguStop.com

తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటించింది.అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

తొలిసారిగా మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా.ఆ తర్వాత నితిన్ నటించిన ‘అఆ’ సినిమాలో తెలుగు వారికి పరిచయమైంది.

అలా ప్రేమమ్, శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యు వంటి పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Telugu Aa, Allu Arjun, Dj Tillu, Handsome, Tolywood-Movie

ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా( Social media )లో బాగా యాక్టివ్ గా ఉండడమే కాకుండా అల్లరి పిల్లగా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.నిత్యం ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తుంటుంది.

అంతేకాకుండా ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.ప్రతి రోజు ఏదోక ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.

అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.వారు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.

Telugu Aa, Allu Arjun, Dj Tillu, Handsome, Tolywood-Movie

చాలావరకు ఇన్స్టా రీల్స్ తో భలే సందడి చేస్తుంది ఈ కేరళ కుట్టి.అంతేకాకుండా తన సోదరుడితో ఆడుకుంటున్న వీడియోలను, అల్లరి చేస్తున్న వీడియోలను పంచుకుంటూ బాగా లైకులు, కామెంట్ లు పొందుతూ
ఉంటుంది.నాచురల్ గా కనిపిస్తూ అందర్నీ తన వైపు మలుపుకుంది.ఈ మధ్య గ్లామర్ షో చేయడానికి కూడా అసలు వినపడటం లేదు.

Telugu Aa, Allu Arjun, Dj Tillu, Handsome, Tolywood-Movie

ఎప్పుడు కూడా ఈ బ్యూటీ తన అందాలను బయట పెట్టలేదు.కానీ ఈ మధ్య తన అందాలను బయట పెట్టడంతో పాటు రొమాంటిక్ సీన్లల్లో కూడా నటించడంతో తన ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు.ఆమె డీజే టిల్లు 2( DJ Tillu 2 ) లో నటించగా ఈ మూవీ లో కూడా చాలా రొమాంటిక్ గా కనిపించింది.ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈమెపై జనాలు ఫైర్ అవుతున్నారు.

అసలు విషయం ఏంటంటే.రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అనుపమకు ఇష్టమైన హ్యాండ్ సమ్ హీరో ఎవరు అనే ప్రశ్న ఎదురవటంతో హ్యాండ్సమ్ అండ్ స్టార్ హీరో తనకు నచ్చిన హీరో అల్లు అర్జున్ అని అన్నది.

దీంతో అనుపమ మాటలకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫిదా అవ్వగా.మిగతా హీరోల అభిమానులు మాత్రం బాగా ఫైర్ అవుతున్నారు.

ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఒక్కడే హ్యాండ్సమ్ హీరోనా.మిగతా హీరోలు పనికిరారా అని తనపై ఫైర్ అవుతున్నారు.

కనీసం అల్లు అర్జున్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ ఆయన హ్యాండ్సమ్ హీరో ఎలా అయ్యాడని ఏకిపారేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube