ఐదు వేల బడ్జెట్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..!

ఇటీవలే కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.సెల్ ఫోన్ తయారీ కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు మార్కెట్లోకి విడుదల చేస్తూ, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలోనే విడుదల చేస్తున్నాయి.

 These Are The Best Smart Phones In A Budget Of Five Thousand..! , Smart Phones-TeluguStop.com

కంపెనీల మధ్య భారీ పోటీ ఉండడంతో చాలా తక్కువ ధరలోనే కావలసిన ఫీచర్లతో మొబైల్ ఫోన్లు ప్రతి ఒక్క వినియోగదారునికి అందుబాటులో ఉన్నాయి.ఇప్పుడు రూ.5000 బడ్జెట్లో ఉండే బెస్ట్ ఫీచర్స్ తో ఉండే మొబైల్ ఫోన్స్ ( Mobile phones )ఏమిటో చూద్దాం.

Nokia 2.0 స్మార్ట్ ఫోన్:

ఈ ఫోన్ 5.5 అంగుళాల టచ్ స్క్రీన్ తో వస్తుంది.1GB RAM+ 8GB స్టోరేజ్ తో వస్తుంది.ఈ ఫోన్ 8 ఎంపీ బ్యాక్ కెమెరాతో పాటు 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఉంటుంది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ వీ 8 పనిచేసే స్నాప్ డ్రాగన్ 425 సార్ తో పనిచేస్తుంది.ఇక బ్యాటరీ విషయానికి వస్తే 4000mAh బ్యాటరీ తో ఉంటుంది.

ఐటెల్ ఏ 23 ఎస్ స్మార్ట్ ఫోన్:

ఈ ఫోన్ ఐదు అంగుళాల డిస్ ప్లే తో ఉంటుంది.2GB RAM+ 32GB storage తో వస్తుంది.3020mAh బ్యాటరీతో ఉంటుంది.ఈ ఫోన్ ఆండ్రాయిడ్ గో 11 తో పనిచేస్తుంది.

ఈ ఫోన్ కొనుగోలు చేసిన 100 రోజుల లోపు ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్( Free screen replacement ) ను కూడా పొందవచ్చు.ఈ ఫోన్ 15 భాషలకు మద్దతు ఇస్తుంది.

ఐకాల్ జెడ్ 14జీ ఫోన్:

ఈ ఫోన్ 5.5 అంగుళాల డిస్ ప్లే తో ఉంటుంది.3GB RAM+ 32GB storage తో వస్తుంది.ఫోన్ ముందువైపు 8 ఎంపీ కెమెరా వెనుక వైపు 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఉంటుంది.ఈ ఫోన్ 8.1 ఆండ్రాయిడ్ తో పని చేస్తుంది.

ఐటెల్ ఏ 60ఎస్ ఫోన్:

ఈ ఫోన్( Itel A60s ) 6.6 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాకర్ వంటి భద్రత ఫీచర్లతో వస్తుంది.8 ఎంపీ బ్యాక్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఉంటుంది.4GB RAM+ 64GB storage తో వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube