ఆ రెస్టారెంట్‌లో శాండ్‌విచ్‌ జీవితకాలం ఫ్రీ అంట.. ఒకసారి ట్రై చేస్తారా?

శాండ్‌విచ్‌( Sandwich ) ఎవరికి చేదు? నేటి యువత సరదాగా ఓ సాయంత్రం పూట అలా ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ కి వెళ్లి రకరకాల స్నాక్స్ తీసుకుంటూ వుంటారు.అందులో ప్రధానమైనది శాండ్‌విచ్‌.

 Change Your Name Get Free Sandwich Forever Details, Restaurant, Sandwich, Latest-TeluguStop.com

అవును, యువతులు ముఖ్యంగా దీనిని చాలా ఇష్టంగా తింటూ వుంటారు.అందుకే చాలామంది వ్యాపారాలు కేవలం దీనిమీదే ఆధారపడుతూ గట్టిగా గడిస్తూ వుంటారు.

మరి అలాంటి రుచికరమైన శాండ్‌విచ్‌ డబ్బులు పెట్టకుండానే ఉచితంగా వస్తుంది అంటే ఇక ఆగుతారా? అవును, మీరు విన్నది నిజం.ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ శాండ్‌విచ్‌ ప్రియులకు శుభవార్త తీసుకు వచ్చింది.

ఈ క్రమంలో అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చింది.

Telugu America, Change, Sandwich, Latest, Restaurant, Subway Sandwich-Latest New

అదే… ఒక్క రూపాయి చెల్లించకుండా జీవితకాలం శాండ్‌ విచ్‌ ఫ్రీగా( Free Sandwich ) ఇస్తామనడం.ఏంటీ.నమ్మలేక పోతున్నారా? ఇది నమ్మాల్సిందే అండీ.అయితే ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు వర్తిస్తాయి.అమెరికాలోని సబ్‌వే రెస్టారెంట్‌( Subway Restaurant ) ఈ విచిత్ర ఆఫర్‌ ప్రకటించింది.దానికి అక్కడ ఓ పోటీలో నెగ్గవల్సి ఉంటుంది.ఈ పోటీ ఆగస్టు 1 నుంచి 4వ తేదీ మధ్య మాత్రమే జరుగుతుంది సుమా.

అయితే దీనిలో నెగ్గిన వారికి ఒక్కరోజు కాదు, జీవితాంతం శాండ్‌విచ్‌ ఫ్రీ.అందుకు ముందుగా సబ్‌వే రెస్టారెంట్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ పేర్లను నమోదు చేసుకోవల్సి ఉంటుంది.

వారందరిలో సబ్‌వే ఒకరిని ఎంపిక చేసి లైఫ్‌లాంగ్‌ శాండ్‌విచ్‌ ఉచితంగా ఇవ్వనుంది.

Telugu America, Change, Sandwich, Latest, Restaurant, Subway Sandwich-Latest New

ఇక పోటీ ఏమిటంటే, ఈ కాంపిటీషన్‌లో ( Competition ) పేరు నమోదు చేసుకున్న వారు చట్టబద్దంగా తమ పేరు మార్చుకోవాల్సి ఉంటుంది మరి.అయితే అలా పేరు మార్చుకోవడానికి అవసరమైన అన్ని లీగల్‌ ప్రాసెసింగ్‌ ఖర్చులను సబ్‌వే రెస్టారెంటే భరించనుండడం గమనార్హం.సబ్‌వే ఇలాంటి ప్రత్యేకమైన ఆఫర్‌తో ముందుకు రావడం ఇదే మొదటిసారి కాదు.

గతేడాది కూడా ఈ ఉచిత శాండ్‌విచ్‌ల ఆఫర్‌ ఏడాది పొడవునా ప్రకటించడం గమనార్హం.తామిచ్చిన కొలతల్లో పోటీలో పాల్గొనే వారు తమ పేరును శరీరంపై టాటూ వేయించుకోవాలన్నది గతేడాది కాన్సెఫ్ట్.

అలా సరైన పరిమాణం, కొలతలతో టాటూ వేయించుకున్న వారికి నగదు బహుమతి ఇచ్చింది.ఇకపోతే సబ్‌వే రెస్టారెంట్‌ ప్రపంచ వ్యాప్తంగా 37 వేల బ్రాంచుల్లో వందకు పైగా దేశాల్లో సక్సెస్‌ ఫుల్‌గా వ్యాపారం కంటిన్యూ చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube