సాధారణంగా ఆడవారు బయటకు వెళ్లేటప్పుడు వారితో పాటు హ్యాండ్ బ్యాగ్‌లను( Hand Bags ) తీసుకెళుతుంటారు.మార్కెట్‌కు లేదా పార్టీకి వెళ్లడానికి, వారితో ఒక అట్రాక్టివ్ హ్యాండ్ బ్యాగ్ ఉండాలని కోరుకోవడం సహజం.
పేద, మధ్య తరగతి అమ్మాయిలు అవసరం కోసం హ్యాండ్ బ్యాగ్‌లను ఉపయోగిస్తే, రిచ్ పీపుల్ వాటిని స్టాటస్ సింబల్‌గా వాడుతుంటారు.అందువల్ల, మార్కెట్లో రూ.100 నుంచి వేల రూపాయల వరకు వివిధ ధరల హ్యాండ్ బ్యాగ్‌లు మహిళలకు అందుబాటులో ఉన్నాయి.అయితే సెలబ్రిటీలు, హీరోయిన్లు వాడే బ్యాగులు మాత్రం చాలా ఖరీదైనవిగా ఉంటాయి.
ఒక్కో బ్యాగ్ ఒక్కోసారి లక్షల విలువ పలుకుతుంది.

అమెరికాకు చెందిన టీవీ నటి, మోడల్ కిమ్ కర్దాషియన్( Kim Kardashian ) దగ్గర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ ఉంది.దాని ధర ఏకంగా 3.12 కోట్ల రూపాయలు. ఈ బ్యాగ్‌ను లగ్జరియస్ బ్రాండ్ హిర్మేస్ తయారు చేసింది.దీని డిజైన్‌లో బంగారం, డైమండ్‌లు ఉపయోగించబడ్డాయి.అందుకే దానికంత ధర.ప్రపంచంలో అతి తక్కువ మంది దగ్గర మాత్రమే ఈ బ్యాగ్ ఉంది.కొంతమంది సెలబ్రిటీల కోసం స్పెషల్‌గా ఈ కంపెనీ ఇలాంటి బ్యాగులను తయారు చేస్తుంటుంది.మార్కెట్లో ఈ రకమైన బ్యాగులు లేవు.

కిమ్ కర్దాషియన్ ఒక సోషల్ మీడియా స్టార్.ఆమె అప్‌డేట్ అయ్యే ఫ్యాషన్‌లను ఫాలో అవడంలో ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుంది.ఆమె ధరించే దుస్తుల నుంచి యాక్సెసరీస్‌ల వరకు ప్రతీది చాలా ఖరీదైనది.తాజాగా, కిమ్ కర్దాషియన్ ఒక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో( Football Match ) కనిపించింది.ఆ సమయంలో ఆమె చేతిలో కనిపించిన హ్యాండ్ బ్యాగ్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది.ఎందుకంటే ఇది చాలా ఖరీదైనది.దీని ధర అక్షరాలా రూ.3.12 కోట్లు అట.ఈ బ్యాగ్ గురించి సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది.చాలా మంది ఈ బ్యాగ్ ధర టూ మచ్ అని అన్నారు.







