రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) సోమవారం తహాసిల్దార్ కేడర్ నుంచి ఇటీవలే డిప్యూటీ కలెక్టర్ లుగా పదోన్నతి పొందిన బి గంగయ్య ,పి సదానందం, ఎన్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanti ), అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ లను కలెక్టరేట్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.మొక్కను బహూకరించి తమ పదోన్నతి , పోస్టింగ్ వివరాలను తెలియజేశారు.
ముగ్గురికి కలెక్టర్, అదనపు కలెక్టర్ లు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభావంతంగా ప్రజల చెంతకు చేరేలా తమ వంతు కృషి చేయాలని సూచించారు.
కాగా బి గంగయ్య కు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఈఓ గా పోస్టింగ్ ఇవ్వగా,పిట్టల సదానందం( Pittala Sadanandam ) కు కు సిరిసిల్ల ల్యాండ్ అక్విజిషన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా , నక్క శ్రీనివాస్ కు రాజన్న సిరిసిల్ల డి ఆర్ డి ఒ గా పోస్టింగ్ ఇచ్చింది.బి గంగయ్య, నక్క శ్రీనివాస్ లకు ప్రభుత్వం ఫారిన్ సర్వీస్ లో ఈఓ డి ఆర్ డి ఒ గా పోస్టింగ్ ఇవ్వడంతో రేపు హైద్రాబాద్ వెళ్లి సంబంధిత ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులను కలిసి వారి ఉత్తర్వులతో రేపు బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది.
పిట్టల సదానందం సిరిసిల్ల ల్యాండ్ అక్విజిషన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా ఎల్లుండి బుధవారం బాధ్యత లు చేపట్టనున్నట్లు సమాచారం.ఇది ఇలా ఉండగా వేములవాడ అర్బన్ తాసిల్దార్ విధులు నిర్వర్తిస్తున్న ఎస్ రాజుకు డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి కల్పిస్తూ కరీంనగర్ జిల్లా హుజరాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారిగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.







