సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో ఉన్న ఖాళీ స్థలాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు నీరు నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతుంది.ఆ మురికి గుంట రోడ్డు పక్కనే ఉండడంతో వాహనదారులకు కూడా ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పక్కనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నప్పటికీ డాక్టర్లు, ఏఎన్ఎంలు నిల్వ ఉన్న నీటిపై గ్రామపంచాయతీ అధికారులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టకపోవడంతో గ్రామంలో విష జ్వరాలు ప్రబలి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
ఇదంతా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే గ్రామ పంచాయతీ వర్కర్లు సమ్మెలో ఉండడంతో గ్రామాలలో పరిస్థితి అధ్వానంగా మారింది.
గ్రామాలలో సీజనల్ వ్యాధిపై అవగాహన సదస్సు కార్యక్రమాలు చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి నిల్వలు ఉన్న నీళ్లను వెంటనే తొలగించాలని,అందులో బ్లీచింగ్ పౌడర్ చల్లి, దోమల నివారణను తగ్గించాలని కోరారు.