సెలబ్రెటీలు బయటకు వెళ్లినప్పుడు అనుకోని ఘటనలు జరుగుతూ ఉంటాయి.సెలబ్రెటీలను చూడగానే అభిమానులు ఎగబడుతూ ఉంటారు.
వారిని చూసేందుకు, ఫొటోలు దిగేందుకు పోటీ పడతారు.ఇలాంటి సమయంలో సెలబ్రెటీలకు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి.
కొంతమంది సెలబ్రెటీలపై దాడులకు పాల్పడుతూ ఉంటారు.ఏదొకటి విసిరేయడం లాంటివి చేస్తూ ఉంటారు.
తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.
ఆర్టిస్ట్ లు స్టేజ్‌లపై ప్రదర్శనలు చేస్తున్న సమయంలో కొంతమంది ఉత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు.వారిపై ఏవి పడితే అవి విసిరేయడం, ఆటంకాలు కలిగించడం లాంటివి చేస్తూ ఉంటారు.తాజాగా ఒక ఆర్టిస్ట్ కి అలాంటి పరిస్థితే ఎదురైంది.
అమెరికన్ ర్యాంపర్ కార్డి బి( Cardi B ) స్టేజ్‌పై ప్రదర్శన ఇస్తుండగా షాకింగ్ సంఘటన ఎదురైంది.ఆమె వేదికపై ప్రదర్శన చేస్తుండగా ఒక వ్యక్తి ఆల్కహాల్ గ్లాస్ ను( Alcohol Glass ) విసిరేశాడు.
దీంతో ఆమె కోపంతో తన చేతిలోని మైక్‌ను విసిరేసింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ఒక అభిమాని ఆల్కహాల్ గ్లాస్ ను ఆమెపైకి చల్లినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.దీంతో ఆమె వెంటనే కోపానికి గురై మైక్ ను విసిరిగొట్టింది.అనంతరం ఆమె గట్టిగా అరిచింది.ఆ తర్వాత కొంతమంది ప్రేక్షకులు ఈ పని చేసిన వ్యక్తిని బయటకు తీసుకెళ్లారు.కార్డి బి ఈ వీడియెను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో కాస్త వైరల్ గా మారింది.ఆల్కహాల్ గ్లాస్ విసిరిన వ్యక్తిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సెలబ్రెటీలపై వస్తువులను విసిరేయడం మానుకోవాలని కొంతమంది సూచిస్తున్నారు.అయితే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోడం ఇది తొలిసారి కాదు.
గతంలో సింగర్ హ్యారీ స్ట్రైల్ వియనాల్లో ప్రదర్శన చేస్తున్న సమయంలో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.దీంతో అప్పుడు ఆమె కంటికి గాయమైంది.