విశాఖలోని పెదవాల్తేర్ లో వెల్నెస్ సెంటర్ కూల్చివేతపై బీజేపీ తీవ్రంగా మండిపడింది.ఈ క్రమంలో వెల్నెస్ సెంటర్ శిథిలాలను ఎంపీ జీవీఎల్ పరిశీలించారు.
రోడ్డు విస్తరణ పేరుతో సీజీహెచ్ఎస్ ముందు భాగాన్ని నిర్లక్ష్యంగా కూల్చివేశారని మండిపడ్డారు.విద్యుత్ లైన్లు కూడా తొలగించకుండా ఎలా కూలుస్తారని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్యం కోసం ఓపీ సేవలు అందించే ప్రదేశమని చెప్పారు.ఎనిమిది వేల మంది కార్డుదారులతో పాటు ఇరవై వేల మంది లబ్దిదారులున్నారన్నారు.
జగన్ ప్రభుత్వానికి నిర్మాణాలు చేతకాదని విమర్శించారు.ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తే సహించేది లేదని జీవీఎల్ స్పష్టం చేశారు.