తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్యారెక్టర్ ఆర్టిస్టులు( Character artists ) గా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నప్పటికీ ఇంకా కొత్తవాళ్ళు రావాలి అని చాలా మంది డైరెక్టర్లు అంటున్నారు.నిజానికి ఏ పెద్ద సినిమా తీసుకున్న వాళ్లే నలుగురు, అయిదుగురు మాత్రమే క్యారెక్టర్ ఆర్టిస్టులు కనిపిస్తున్నారు కాబట్టి ఇక వాళ్లు తప్ప వేరే వాళ్ళు ఇండస్ట్రీ లో లేరా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి దాని వల్లే హీరో ఫాదర్ క్యారెక్టర్లు చేయడానికి పక్క ఇండస్ట్రీ నుంచి ఆర్టిస్ట్ లను తీసుకు రావాల్సి వస్తుంది.

నిజానికి హీరో ఫాదర్ గా చేయడానికి రాజేంద్ర ప్రసాద్( Rajendra Prasad ) సీనియర్ నరేష్ లాంటి నటులు ఉన్న కూడా ప్రతి సినిమాల్లో వాళ్లే రిపీట్ అవుతున్నారు అందు వల్ల ఇక మీదట ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలి అని దర్శకులు తెలుగు నటీనటుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సీనియర్ నటులు ఎవరెవరు ఉన్నారో చూసుకొని వాళ్లలో కొందరికి మంచి క్యారెక్టర్లు ఇస్తు వాళ్ల చేత నటింపజేస్తున్నారు…అందులో భాగం గా ఇప్పుడు సీనియర్ హీరోలకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి డిమాండ్ అయితే ఉంది.కాబట్టి వాళ్ళు కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నారు.

అయితే ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిన సీనియర్ హీరోలు అయిన వడ్డే నవీన్,ఆర్యన్ రాజేష్,తరుణ్( Vadde Naveen, Aryan Rajesh, Tarun ) లాంటి వాళ్ళు కూడా హీరో కి అన్నయ్య గా పాత్రలు చేయడానికి ముందుకు వస్తున్నారు ఇలా ఇండస్ట్రీ లో ఉన్న అందరూ కలిసి కట్టు గా సినిమాలు చేస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ముందుకు తీసుకువెళ్లాలని ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.అయితే తెలుగు సినిమా ఇప్పుడు ఇండియా లోనే టాప్ ఇండస్ట్రీ గా పేరు సంపాదించుకుంది కాబట్టి ఇలాంటి టైం లో మన ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా వెలుగులోకి వస్తే బాగుంటుంది…








