తెలంగాణ రాష్ట్రానికి రేపు కేంద్ర బృందం రానుంది.వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అనేక జిల్లాల్లో వర్షాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా రోడ్లతో పాటు పలు పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు.బీజేపీ బృందాలు వరద ప్రాంతాల్లో పర్యటిస్తాయని పేర్కొన్నారు.
అదేవిధంగా తెలంగాణలో వరదలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు వివరించినట్లు తెలిపారు.దీనిపై స్పందించిన అమిత్ షా రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపిస్తామని చెప్పారన్నారు.
ఈ మేరకు రేపు కేంద్ర బృందం తెలంగాణకు వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు తీసుకుంటారని వెల్లడించారు.







