సాధారణంగా కారు కొనాలని, మంచి జాబ్ పొందాలని ప్రతి ఒక్కరికీ ఏదో ఒక కల ఉంటుంది.అయితే కొందరు కలలు మాత్రం విచిత్రంగా ఉంటాయి.
జపాన్‌కు చెందిన టాకో అనే వ్యక్తి కూడా ఒక విడ్డూరమైన కల కన్నాడు.అతడు చిన్నప్పటి నుంచి కుక్కలా( Dog ) మారాలని కలలు కన్నాడు.
ఇదేం కల అని మనం ఆశ్చర్యపోయినా అతడికి మాత్రం శునకంగా మారాలనే కోరిక బలంగా ఉండేది.అందుకే 2018లో, అతను తన కలను సాకారం చేసుకునేందుకు ఏకంగా 20,000 డాలర్లు (దాదాపు రూ.16.5 లక్షలు) ఖర్చు చేశాడు.

టాకో సినిమాలు, టీవీ షోల కోసం కాస్ట్యూమ్‌లను తయారు చేసే జెప్పెట్( Zeppet) అనే కంపెనీని సంప్రదించాడు.సదరు కంపెనీ అతని కోసం 40 రోజుల్లోనే ఒక హైపర్ రియలిస్టిక్ డాగ్ ఔట్‌ఫిట్‌ను తయారు చేసింది.ఆ ఔట్‌ఫిట్ మొత్తం నాలుగు కాళ్లను, డాగ్ శరీరాన్ని కవర్ చేస్తుంది.సింపుల్‌గా చెప్పాలంటే మానవుడు కుక్కగా మారితే ఎలా కనిపిస్తుందో అలా ఈ ఔట్‌ఫిట్ కనిపిస్తుంది.
టాకో రీసెంట్‌గా ఈ ఔట్‌ఫిట్‌ను ధరించి కుక్కలాగా చేతులు, కాళ్లు నేలపై పెట్టి నడుస్తున్నాడు.కుక్కవలె పండి బోర్లుతున్నాడు.దానికి సంబంధించిన దృశ్యాలను తన యూట్యూబ్ ఛానెల్ “ఐ వాంట్ టు బీ యాన్ యానిమల్“లో వీడియోలుగా పోస్ట్ చేస్తున్నాడు.అతని వీడియోలు కోట్ల వ్యూస్‌తో వైరల్‌గా మారాయి.
ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిలో కూడా పడ్డాయి.

అతను మీడియాతో మాట్లాడుతూ… “నేను నాలుగు కాళ్లపై నడుస్తూ, నేలపై పొర్లడం, నా ముక్కుతో కుక్కలాగా వాసన చూడటం చాలా ఆనందంగా ఉంది.నేను ఇతర కుక్కలతో కనెక్ట్ అయ్యేలా మారడం, వాటిని నా స్నేహితులుగా చేసుకోవడం చాలా సరదాగా అనిపిస్తోంది.నేను నా జంతువు అవతారం నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.నేను నేర్చుకున్న సరదా విషయాలలో ఒకటి కుక్కలు చాలా స్వేచ్ఛగా, ఆనందంగా ఉంటాయని.” అని అన్నాడు.టాకో ఔట్‌ఫిట్( Toco ) చాలా ఖరీదైనది, కానీ అతను దీని కోసం ఖర్చు చేసిన డబ్బు విలువైనదని నమ్ముతున్నాడు.అతను ఈ ఔట్‌ఫిట్‌ను ధరించడం ద్వారా అతను తన జీవితంలో చాలా ఆనందాన్ని కనుగొన్నాడని చెప్పాడు.
టాకో వీడియోలు చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.







