విదేశీ వృత్తి నిపుణులకు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో( USA ) ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ వీసాకు( H-1B Visa ) సంబంధించి కీలక ప్రకటన వెలువడింది.ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి గాను ఈ కేటగిరీ కింద వీసాలను మంజూరు చేసేందుకు గాను రెండో రౌండ్ లాటరీని నిర్వహించనున్నారు.
ఈ నిర్ణయంతో ఇండియన్ ప్రొఫెషనల్స్‌కి ఎక్కుల మేలు కలుగుతుందని ఇమ్మిగ్రేషన్ రంగ నిపుణులు చెబుతున్నారు.హెచ్ 1 బీ వీసాల కోసం ఇప్పటికే అర్హత సాధించిన ఎలక్ట్రానిక్ దరఖాస్తులకు త్వరలో లాటరీ నిర్వహిస్తామని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ఒక ప్రకటనలో తెలిపింది.
గతంలో సమర్పించిన ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్‌లలో అదనంగా వచ్చిన వాటికి ర్యాండమ్ సెలక్షన్ పద్ధతిలో ఎంపిక చేస్తామని పేర్కొంది.

కాగా.హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి ఎప్పుడూ ఏదో వివాదం వుంటూనే వుంటుంది.ఏటా హెచ్-1బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.
వీటిలో కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా( America Visa ) జారీ చేస్తుంది.వీటితో పాటు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలు ఇస్తారు.
అంటే మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలన్న మాట.భారత్, చైనా వంటి దేశాల నుంచి ప్రతి ఏడాది పదివేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి టెక్ కంపెనీలకు హెచ్1బీ వీసాలే శరణ్యం.

అయితే ప్రస్తుతం 65,000గా వున్న హెచ్ 1 బీ వీసాలను రెట్టింపు చేయాలని అమెరికాలో భారతీయ అమెరికన్‌ల యాజమాన్యంలో 2,100కు పైగా వున్న చిన్న , మధ్యతరహా ఐటీ కంపెనీల సంఘం( IT Companies ) ఇటీవల చట్టసభ సభ్యులను కోరింది.దేశంలో నైపుణ్యంలో కలిగిన వర్క్‌ఫోర్స్ కొరతను పరిష్కరించడానికి తక్షణం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.‘‘ ITServe ’’ అని పిలిచే ఈ అసోసియేషన్‌లో 240 మందికి పైగా సభ్యులు వున్నారు.యూఎస్ క్యాపిటల్‌లో కాంగ్రెస్ న్యాయవాద దినోత్సవం సందర్భంగా తొలిసారిగా వ్యక్తిగతంగా వీరంతా సమావేశమయ్యారు.
అధిక నైపుణ్యం కలిగిన శ్రామికుల కొరత తమ వ్యాపారాలపై , అంతిమంగా అమెరికా ప్రయోజనాలపై ప్రభావం చూపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.







