పుష్ప 2 లో శ్రీలీల... నాకు అక్కర్లేదు అనేసిందట!

ప్రస్తుతం టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో శ్రీలీల ( Sreeleela )పేరు ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఒక వైపు మహేష్ బాబు తో గుంటూరు కారం సినిమా ( Guntur Kaaram Movie )లో నటిస్తుంది.

మరో వైపు పవన్ కళ్యాణ్‌ సినిమా లో హీరోయిన్‌ గా ఎంపిక అయింది.ఇక తాజాగా బుచ్చి బాబు దర్శకత్వం లో రామ్‌ చరణ్ హీరోగా రూపొందబోతున్న సినిమా లో కూడా ఈ అమ్మడు ఎంపిక అయింది.

Telugu Allu Arjun, Guntur Kaaram, Pushpa, Sreeleela, Sukumar-Movie

ఈ సమయంలోనే ఈమెకు పుష్ప 2 ( Pushpa 2 )మేకర్స్ నుండి ఆఫర్‌ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.పుష్ప 2 సినిమా లో హీరోయిన్‌ గా రష్మిక మందన్నా నటిస్తున్న విషయం తెల్సిందే.మరి పుష్ప 2 లో శ్రీ లీల తో సంబంధం ఏంటా అనుకుంటున్నారా.అసలు విషయం ఏంటి అంటే పుష్ప సినిమా లో సమంత ఐటం సాంగ్ చేసిన విషయం తెల్సిందే.

ఐటం సాంగ్ తో పుష్ప సినిమా కు మంచి బజ్ క్రియేట్‌ అయింది.ఇప్పుడు పుష్ప 2 సినిమా లో శ్రీ లీలతో ఐటం సాంగ్ చేయించాలని దర్శకుడు సుకుమార్‌ భావించాడు.

Telugu Allu Arjun, Guntur Kaaram, Pushpa, Sreeleela, Sukumar-Movie

అల్లు అర్జున్‌ ( Allu arjun )కూడా తప్పకుండా చేద్దాం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేశాడట.కానీ ప్రస్తుత సమయంలో శ్రీలీల ఐటం సాంగ్‌ ను చేసేందుకు నో చెప్పిందని తెలుస్తోంది.ఇంత మంది స్టార్‌ హీరోల సినిమాల్లో నటిస్తున్న నేను ఐటం సాంగ్ ఎలా చేస్తాను అంటూ తేల్చి చెప్పిందట.అంతే కాకుండా పుష్ప 2 సినిమా లో కీలక పాత్ర లో నటించే అవకాశం ఇచ్చినా కూడా చేయను అన్నట్లుగా చెప్పిందట.

అయితే అల్లు అర్జున్ తో సినిమా చేయడం కోసం వెయిట్‌ చేస్తున్నట్లుగా మాత్రం పేర్కొంది.మొత్తానికి అల్లు అర్జున్‌ పుష్ప 2 సినిమా లో ఐటెం సాంగ్ ను శ్రీలీల చేయడం లేదు.

ఆమె ను సంప్రదిస్తే నో చెప్పడం తో బాలీవుడ్‌ హాట్ బ్యూటీ ని సంప్రదించడం జరిగిందని తెలుస్తోంది.ఆ హాట్ బ్యూటీ ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube