అల్లం సాగులో చీడపీడల, తెగుళ్ల బెడద కారణంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు అల్లం సాగు( Ginger Cultivation ) చేయడానికి ఆసక్తి చూపించడం లేదు.అయితే ఎత్తు మడుల విధానంలో అల్లం సాగు చేస్తే తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడి సాధించవచ్చు.
అల్లం సుగంధ ద్రవ్యపు పంట.అల్లం సాగుకు అన్ని నేలలు అనుకూలంగా ఉండవు.తేమతో కూడిన వేడి వాతావరణం ఉండే నేలను అల్లం సాగుకు అత్యంత అనుకూలంగా ఉంటాయి.నీడ ఉండే ప్రాంతాల్లో కూడా అల్లం సాగులో అధిక దిగుబడి సాధించవచ్చు.
కాకపోతే 19 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో అల్లం పంటను సాగు చేస్తే ఆసాజనకంగా ఉంటుంది.

సాధారణ పద్ధతిలో కాకుండా ఎత్తుమడుల విధానంలో అల్లాన్ని సాగు చేస్తే 9 నెలలకు పంట చేతికి వస్తుంది.ఈ విధానం వల్ల మురుగునీటి సౌకర్యం పెరిగి, వేరు వ్యవస్థకు చీడపీడలు ఆశించవు.ఎత్తుమడుల విధానంలో బెట్ట, కరువు, ఎండాకాలంలో తేమను నిలుపుకునే సౌకర్యం ఉంటుంది.
కలుపు తీయడానికి కూడా ఈ విధానం చాలా సులభం.ఎత్తుమడుల విధానంలో నేల గుళ్లబారటం జరుగుతుంది.
ఇలా జరగడం వల్ల వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది.మొక్కలు నీటిని పోషకలను పీల్చుకునే సామర్థ్యాన్ని బాగా పెంచుకోవడం వల్ల మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి.

పొలాన్ని ముందుగా లోతు దుక్కులు దున్నుకొని, ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు( Cattle manure ) వేసి కలియదున్నాలి.ఆ తర్వాత పంట పొలంలో ఇతర పంటల అవశేషాలు పూర్తిగా తొలగించాలి.ఇక ఎత్తుమడులను కావలసిన విధానంలో ఏర్పాటు చేసుకోవాలి.మడుల మధ్య తిరగడానికి కాస్త ఎక్కువ చోటు ఉండేటట్లు ఏర్పాటు చేయాలి.ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు చేపట్టాలి.







