ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షం కన్నా దూకుడుగా ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేస్తున్న జనసేన మరో పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది .వైసీపీ ప్రభుత్వం( YCP ) ప్రతిష్టాత్మకంగా చెబుతున్న జగనన్న కాలనీల లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని, ఇది వైసిపి పరిపాలనలో జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటని మొదటి నుంచి వాదిస్తున్న జనసేన ఇప్పుడు దానిని నిరూపించేందుకు సోషల్ మీడియా వేదికగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.
నిరుపయోగంగా ఉన్న భూమిలను వైసీపీ నేతలు వారి అనుచరులు తక్కువ రేటుకు కొన్ని ప్రభుత్వానికి అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకున్నారని, మంత్రులు స్థాయి నుంచి వీరికి మద్దతు ఉందని కొన్ని వేలకోట్లు దీనిలో చేతులు మారాయని చాలా కాలంగా జనసేన ఆరోపిస్తుంది .

ప్రభుత్వం పేదలకు పంచి పెడుతున్నామని చెప్తున్న చాలా భూములు ఊరికి చాలా దూరంగాను మౌలిక సదుపాయాల కల్పనకు అవకాశం లేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నవని, వీటిని అధిక ధరలకు కేవలం తమ స్వలాభం కోసం మాత్రమే సేకరించారని వర్షం వస్తే వాటి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలకు చూపించాలని జనసేన </em( Jana sena )నిర్ణయించుకుంది.ఒకవేళ తమ ఫోటోలను ఫేక్ అంటారని లేదా ఎడిట్ చేసినవి అంటారనే ఆలోచన తో అలా అనడానికి వీలు లేకుండా సమయాన్ని ప్రదేశాన్ని కూడా రికార్డు చేసే గూగుల్ జిపిఎస్ యాప్ సాంకేతికత ను వాడుకుని పోటో లు తీయాలని నిర్ణయించుకోవడం గమనార్హం .

ఈ దిశగా జనసేన వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పనకు 89 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెబుతున్న ప్రభుత్వ ఈ వేల కోట్లు అన్ని ఎక్కడికి వెళ్ళిపోతున్నాయని ప్రశ్నించారు .జగనన్న కాలనీలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు, రోడ్లు ,పార్కులు ,ఆరోగ్య కేంద్రాలు, ఇలాంటివి ఏర్పాటు చేస్తామని మాటలు చెబుతున్నారు గాని ఇవి నిజానికి చాలా దుర్భర పరిస్థితుల్లో కునరిల్లుతున్నాయని వాటి స్వరూపాన్ని జనసేన పార్టీ బయటపడుతుందంటూ ప్రకటించారు.నిర్మాణాత్మక ప్రతిపక్షంగా జనసేన పోషిస్తున్న పాత్ర పట్ల రాజకీయ వర్గాల్లో కూడా హర్షం వ్యక్తం అవుతుంది.
ప్రశ్నించేవాడు లేకపోతే అభివృద్ధి జరగదని ,వ్యవస్థలు మోనోపలి అయిపోతాయని కూడా విశ్లేషణ లు వస్తున్నాయి .







