సిరిసిల్ల కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ వై సురేందర్( Principal Y Surender ).రాజన్న సిరిసిల్ల జిల్లా:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం-2020 లో విద్యార్థుల కు గుణాత్మక విద్య అందుతుందని సిరిసిల్ల కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ వై సురేందర్ అన్నారు.నూతన విద్యా విధానం 2020 అమలులోకి వచ్చి 3 ఎండ్లు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం సిరిసిల్ల కేంద్రీయ విద్యాలయం లో మూడో వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా సిరిసిల్ల కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ వై సురేందర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం నూతన విద్యా విధానం 2020 ను ప్రవేశపెట్టిన విషయం.మనందరికీ తెలిసిన విషయమే.1986 నూతన విద్యా విధానం తర్వాత వచ్చినదే జాతీయ విద్యా విధానం 2020 పాఠశాల విద్యా విధానంలో కొన్ని మార్పులు చేర్పులు చేయబడ్డాయి కేంద్రీయ విద్యాలయాలు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ క్రింద స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ 1963 లో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఏర్పడింది.అప్పటినుండి పాఠశాల విద్యలో భారత ప్రభుత్వం చేపట్టే విధానాలకు అనుగుణంగా తనను తాను పరివర్తన చెందుతూ ఈరోజు దేశంలో పాఠశాల విద్యను అందించడంలో అగ్రగామిగా నిలుస్తున్నది నూతన విద్యా విధానం 2020 అమలులోకి వచ్చినప్పటి నుండి దానిలోని కొన్ని విషయాలను ప్రాథమికంగా అమలుపరిస్తున్నది.ముఖ్యంగా ఒకటవ తరగతిను ప్రవేశానికి కావలసిన కనిష్ట వయోపరిమితిని 31 మార్చి నాటికి ఆరు సంవత్సరాల పైబడి 8 సంవత్సరాల లోపు వాళ్లకి గత రెండు సంవత్సరాలుగా అమలుపరుస్తున్నది.
దీనివలన విద్యార్థి యొక్క మెదడు అభివృద్ధి చెంది విషయపరిజ్ఞానం పెరుగుతుంది.గత 10+2 పాఠశాల విద్యా విధానం బదులుగా ఇప్పుడు 5+3+3+4 విధానాన్ని అమలులో భాగంగా దేశంలోని 500 కేంద్రీయ విద్యాలయాల్లో 5 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకు “బాల వాటిక” తరగతిని ప్రారంభించడం జరిగింది.
“బాలవాటిక” వలన ప్రైవేట్ లో అధిక భారం మోయాల్సిన అవసరం తల్లిదండ్రులకు లేకుండా పోయింది.ఎన్ ఏ ఎస్ ( NAS ) (నేషనల్ అసెస్మెంట్ సర్వే) ప్రకారం దేశంలో మూడవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులలో ఉండవలసిన కనీస నైపుణ్యాలైన చదవడం రాయడం మరియు గణిత పరిజ్ఞానం లేకపోవడం వల్ల భారత ప్రభుత్వం 2025 సంవత్సరం వరకు మూడవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులందరికీ కనీస భాష మరియు గణిత సామర్ధ్యాలను కలిగించాలని ఒక యుద్ధాన్ని ప్రకటించి “నిపున్ భారత్ మిషన్” (నిపుణ్ భారత్ మిషన్ ) ను స్థాపించి అమలు కార్యక్రమాన్ని చేపట్టి కేంద్రీయ విద్యాలయం ఆ దిశకు అడుగులు వేస్తూ విజయదశలో ఉంది.
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రస్తుతం బాలవాటిక నుండి 12వ తరగతి వరకు 13 సంవత్సరాలు నాణ్యమైన మరియు నామమాత్రపు ఫీజులు వసూలు చేస్తూ ఉత్తమ లేదా గుణాత్మక విద్యను అందిస్తూ నిరంతరం శ్రమిస్తుంది.
నూతన విద్యా విధానం 2020 యొక్క ప్రత్యేకత మాతృభాషలో విద్యాబోధన ఉండేట్లు చూడటం ప్రధానంగా కేంద్రీయ విద్యాలయాల్లో ఇంగ్లీష్/ హిందీ మాధ్యమంలో బోధన ఉంటుంది.
ఎక్కడైతే విద్యార్థులు ప్రావీణ్యం లేక నేర్చుకోవడం ఇబ్బంది పడతారో అక్కడ మాతృభాషలో బోధన జరగడానికి ప్రయత్నాలు భవిష్యత్తులో జరగవచ్చు.ఆ దిశలోనే ఇటీవలే సీబీఎస్ఈ ఒక ప్రకటన కూడా చేయడం మనం చూసాం.3 నుంచి 8 సంవత్సరాలకు ఫౌండేషన్ స్టేజ్ గాను 8 నుంచి 11 సంవత్సరాల వరకు ప్రిపరేటరీ స్టేజ్ గాను ఈ దిశలో 3 నుంచి 5వ తరగతి వరకు సబ్జెక్టుల ప్రవేశం జరుగుతుంది.6, 7, 8 వ తరగతి లను మిడిల్ స్కూల్ గాను పరిగణిస్తూ ఈ స్టేజిలో ఫ్రీ ఒకేషనల్ ఎడ్యుకేషన్ ప్రవేశ పెట్టడం జరుగుతుంది.విద్యార్థులు ఏ అంశాలలో శ్రద్ధ చూపుతున్నారో గ్రహించి ఆయా అంశాలపై ప్రోత్సహించడం జరుగుతుంది.9 నుంచి 12వ తరగతి వరకు హై స్కూల్ విద్యా గాను పరిగణించి విద్యాబోధన నిర్వహించడం జరుగుతుంది.ఈ దశలో సబ్జెక్టుల ఎంపిక విషయంలో విద్యార్థులకు వెసులుబాటు ఇవ్వడం జరుగుతుంది.నూతన విద్యా విధానం 2020 మూడవ వార్షికోత్సవం సందర్భంగా తమ సహాయ సహకారాలను అందించిన భాగస్వాములైన అందరికీ కేంద్రీయ విద్యాలయం, సిరిసిల్ల కృతజ్ఞతలు తెలియజేస్తుందనీ సిరిసిల్ల కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్ వై సురేందర్ అన్నారు .







