వ్యవసాయ రంగంలో ప్లాస్టిక్ మల్చింగ్ షీట్స్ వల్ల లాభమా.. నష్టమా..!

వ్యవసాయ రంగంలో ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకు పెరుగుతూ పోతోంది.మల్చింగ్ షీట్స్, డ్రిప్ లాటరల్స్, పివిసి పైపులు, ఫార్మ్ ఫౌండ్ లైనింగ్, గ్రీన్ హౌసెస్ ఇలా రకరకాలుగా ప్లాస్టిక్ వినియోగం క్రమంగా పెరుగుతూనే ఉంది.

 The Use Of Plastic In Agriculture Is Increasing With Mulching Sheets Details, P-TeluguStop.com

ముఖ్యంగా మల్చింగ్ షీట్స్( Mulching Sheets ) వినియోగం వ్యవసాయంలో ఒక భాగమైంది.మల్చింగ్ షీట్స్ వల్ల లాభమా-నష్టమా అని చర్చిస్తే.

రెండు ఉన్నాయని వ్యవసాయ క్షేత్రం నిపుణులు సూచిస్తున్నారు.ముందుగా మనం మల్చింగ్ షీట్స్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.

మల్చింగ్ షీట్స్ ఉపయోగించడం వల్ల కలుపు నివారణ సమస్య, రసాయనిక ఎరువుల వాడకం కాస్త మేరకు తగ్గుతుంది.అంతేకాకుండా నీరు ఆవిరి కాకుండా ఈ మల్చింగ్ షీట్స్ కవచంలా ఉంటాయి.

ఇంతవరకు బాగానే ఉంది.కానీ పంట కూత తర్వాత ఈ మల్చింగ్ షీట్స్ అనేవి భూమిలో కలిసిపోయి భూమిలో ఉండే సూక్ష్మజీవులను( Micro Organisms ) నాశనం చేస్తాయి.

Telugu Agriculture, Biodegradable, Crop, Farmers, Micro Organisms, Sheets, Plast

భూమిలో ఉండే సూక్ష్మజీవులు నాశనం అయితే మట్టి తన సారాన్ని కోల్పోతుంది.ఇలా కొన్ని సంత్సరాలపాటు మట్టిలో ప్లాస్టిక్ ( Plastic ) కలవడం వల్ల నేల వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది.పంటలో కూడా నాణ్యత అనేది లోపిస్తుంది.కొంత మంది రైతులు ఈ మల్చింగ్ షీట్స్ ను కాల్చడం వల్ల హానికరమైన రసాయన కారకాలు విడుదలవుతాయి.ఈ మల్చింగ్ షీట్స్ రీసైకిలింగ్ చేసే పద్ధతులు కూడా లేవు.ఒకసారి మాత్రమే వాడుకునేలా ఉంటాయి.

Telugu Agriculture, Biodegradable, Crop, Farmers, Micro Organisms, Sheets, Plast

ఒక అధ్యయనం ప్రకారం ఒక కిలో ప్లాస్టిక్ పొలంలో వాడ వల్ల 7 చదరపు అడుగుల భూమి కాలుష్యంగా మారుతుంది.కాబట్టి రైతులు ప్లాస్టిక్ మల్చింగ్ షీట్స్ కాకుండా పకృతి సిద్ధమైన మల్చింగ్ పద్ధతులను వాడుకోవాలి.ఉదాహరణకు గడ్డి, కొబ్బరి పీచు లాంటి వాటిని మల్చింగ్ షీట్ల లాగా వాడుకోవాలి.

ప్లాస్టిక్ మల్చింగ్ షీట్స్ వల్ల లాభాల కంటే నష్టాలే అధికంగా ఉన్నాయి.

పొలంలో కలుపు( Weed ) సమస్యకు చెప్పేందుకు అంతర పంటలు లేదంటే పంట మార్పిడి పద్ధతులు ఉపయోగించాలి.ప్లాస్టిక్ మల్చింగ్ షీట్స్ వల్ల భూమికి సూర్యరశ్మి సరిగ్గా తగలదు.

అందువల్ల భూమిలో తేమ శాతం పెరిగి వివిధ రకాల తెగుళ్లు చీడపీడలు కూడా పంటను ఆశించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube