టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్టులో మొదటి వరుసలో ఉన్నారు యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sreeleela).మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్నటువంటి శ్రీలీల గురించి నటుడు బ్రహ్మాజీ (Brahmaji)సంచలన వ్యాఖ్యలు చేశారు.బ్రహ్మాజీ ప్రస్తుతం తన కుమారుడు సంజయ్ రావు నటించిన స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా ఈనెల 29వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈయన వరుస ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బ్రహ్మాజీ నటి శ్రీ లీల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.యాంకర్ బ్రహ్మాజీని ప్రశ్నిస్తూ మీకు కనుక ప్రస్తుతం హీరోగా నటించే అవకాశాలు వస్తే ఏ హీరోయిన్ తో నటించాలని కోరుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు బ్రహ్మాజీ సమాధానం చెబుతూ తనకు శ్రీ లీల పక్కన నటించాలని ఉంది అంటూ కామెంట్ చేశారు.

శ్రీ లీల చాలా అద్భుతంగా డాన్స్ చేస్తుంది.అలా అని నాకు డాన్స్ రాదు అనుకుంటే పొరపాటే నేను కూడా డాన్స్ బాగా చేస్తానని తెలిపారు.అంతేకాకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి స్టార్డమ్ సంపాదించుకుంది.శ్రీ లీల ఎనర్జీ లెవెల్స్ కనుక చూస్తే ఈమె త్వరలోనే జయప్రద (Jayaprada) జయసుధ(Jayasudha) శ్రీదేవి(Sridevi) వంటి హీరోయిన్ల స్థాయికి ఎదుగుతుంది అంటూ ఈ సందర్భంగా నటి శ్రీ లీల గురించి నటుడు బ్రహ్మాజీ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







