బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ( Nargis Fakhri ) గురించి మనందరికీ తెలిసిందే.మొదట రాక్ స్టార్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నర్గీస్ ఫక్రీ మొదటి సినిమాతోనే హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది.
ఆ తర్వాత మద్రాస్ కేఫ్, హౌస్‌ఫుల్, మైన్ తేరా హీరో, అజహర్ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.అంతేకాకుండా ఆమె నటించిన తొలి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయలేకపోయింది.
దాంతో కొంచెం బ్రేక్ తీసుకుంది.కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది నర్గీస్ ఫక్రీ.
ఇక తెలుగులో పవన్ కల్యాణ్ సరసన హరిహర వీరమల్లు( Hari Hara Veeramallu ) చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది.అంతేకాకుండా ఓటీటీలో కూడా అరంగేట్రం చేసేందుకు రెడీ అవుతోంది.ప్రస్తుతం ఢిల్లీలో ఉంటోన్న ముద్దుగుమ్మ కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను పంచకుంది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ముంబైలో తనకు ఎదురైన ఒక భయంకరమైన రోజులను గుర్తు చేసుకుంది.
ఈ సందర్బంగా నర్గీస్ ఫక్రీ మాట్లాడుతూ.ముంబైలోని బాంద్రాలో ఒక అపార్ట్‌మెంట్‌లో నివసించేదాన్ని.
మేమేము ఉండే ప్రాంతం హిల్ రోడ్.మా అపార్ట్‌మెంట్‌కు సమీపంలో శ్మశానవాటిక( Cemetry ) ఉంది.
అక్కడ ఉన్నప్పుడు నాకు భయంకరమైన కలలు వచ్చేవి.భయంతో తెల్లవారుజామున 3 గంటలకే లేచేదాన్ని.
కలలో ఒక వ్యక్తి దెయ్యంలా కనిపిస్తూ నన్ను స్మశానవాటికకు తీసుకువెళతాడు.
అక్కడ తను స్మశానవాటికలో మనుషుల ఎముకలు తీసి నన్ను తినమని చెప్పేవాడు.అలా వరుసగా నాలుగు రోజులు అదే కల వచ్చిందని.దీంతో భయంతో వణికిపోయాను అని తెలిపింది.
అలా నాలుగు రోజులు పీడకలలు రావడంతో నాకు భయం వేసి వెంటనే ఆ ఫ్లాట్ ఖాళీ చేసి ఢిల్లీ కీ ( Delhi ) వచ్చేశాను అని చెప్పుకొచ్చింది నర్గీస్ ఫక్రీ.నేను నా రూమ్ ఖాళీ చేసేటప్పుడు ఆరు చనిపోయిన పక్షి పిల్లలు కనిపించాయి అని ఆమె తెలిపింది.
అది నాకు చాలా విచిత్రంగా అనిపించింది అసలు అక్కడ ఏమి జరుగుతుందో నాకు అర్థం కాలేదు అంటూ ఆ భయానకమైన రోజుల గురించి చెప్పుకొచ్చింది.అందుకే ఆ ఇంటిని వదిలి ఢిల్లీకీ వెళ్లానని నర్గీస్ చెప్పుకొచ్చింది.