Pawan Kalyan : వరద బాధితులకు సాయం అందించాలి తెలంగాణ సర్కారుకు పవన్ లేఖ..!

గత కొన్ని రోజులుగా తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో వర్షాలు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.ఈ తరుణంలో చాలామంది ప్రజలు వరదల్లో చిక్కుకొని ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

 Pawan Kalyan Letter To The Telangana Government Should Help The Flood Victims-TeluguStop.com

ఇక భూపాలపల్లి (Bhupalapalli) జిల్లా మొరంచపల్లి గ్రామం మొత్తం వరదల్లో చిక్కుకుంది.దీంతో అక్కడి ప్రజలంతా బిల్డింగుల పైకి వెళ్లి తలదాచుకుంటున్నారు.

Telugu Bhupalapalli, Cm Kcr, Flood Victims, Floods, Heavy, Moranchapalli, Mulugu

ఈ తరుణంలో ప్రభుత్వం ముమ్మర సహాయక చర్యలు అందించాలని పలువురు నాయకులు కోరుతున్నారు.అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ రాష్ట్ర వరద ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలందరిని ఆదుకోవాలని, అలాగే మోరంచపల్లి ( Moranchapalli ) ప్రజలకు తక్షణ సహకారం అందించాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేశారు.

భూపాలపల్లి జిల్లాలో చాలా గ్రామాలు జలదిగ్బంధమయ్యాయని గ్రామాల్లో చాలామంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారని మా దృష్టికి వచ్చింది, దాదాపుగా 200 మంది కుటుంబాలు సాయం కోసం ఎదురు చూస్తున్నారట అంటూ లేఖలో పేర్కొన్నారు.అంతేకాకుండా ములుగు ( Mulugu ) జిల్లాలోని ముత్యాల ధార జలపాతం వద్దకు వెళ్లినటువంటి 40 మంది పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయిన విషయం ఆందోళన కలిగిస్తుంది అన్నారు.

Telugu Bhupalapalli, Cm Kcr, Flood Victims, Floods, Heavy, Moranchapalli, Mulugu

తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు తక్షణమే బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేయాలి.అలాగే నిర్మల్ ( Nirmal ) జిల్లా కడెం ప్రాజెక్టు గరిష్ట స్థాయి దాటి నీరు ఉప్పొంగుతూ ప్రమాద కరంగా మారింది.ప్రాజెక్టు పరిధిలో ఉండేటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.

అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా జలదిగ్బంధంలో ఉన్నటువంటి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

అంతేకాకుండా జనసేన సైనికులు, నాయకులు, వరద బాధితులకు సహకారం అందిస్తూ సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube