కారు అద్దాలను సుత్తితో పగులగొట్టేశాడు.. దానికి కారణం ఇదే..

అమెరికాలోని టెక్సాస్‌లో( Texas ) ఎండలు మండిపోతున్నాయి.పగటి పూట భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

 Baby Locked In Hot Car Rescued By Parents Smashing Windscreen In Texas Details,-TeluguStop.com

ఈ పరిస్థితుల్లో అక్కడ షాకింగ్ ఘటన జరిగింది.ప్రమాదవశాత్తూ ఓ కారు లాక్( Car Lock ) అయింది.

హార్లింగన్‌లోని హెచ్ఈబీ ఫ్యూయల్ స్టేషన్‌లో పార్క్ చేసిన తన కారులో ఇద్దరు చిన్నారులు ఇరుక్కుపోయారు.దీంతో వారు లోపల నుంచి భయంతో కేకలు పెట్టారు.

దీనిని అక్కడే ఉన్న బిడ్డ తండ్రి గమనించాడు.వెంటనే ఓ సుత్తి( Hammer ) తీసుకుని కారు విండ్‌షీల్డ్ విండోను పగలగొట్టాడు.

తర్వాత లోపలి నుంచి ఒక మహిళ విండ్‌షీల్డ్‌లో ఒక శిశువును బయటకు అందించింది.దీంతో ప్రమాదం తప్పింది.

లేకుంటే చిన్నారులు ప్రాణాపాయ పరిస్థితుల్లో పడేవారు.అదే సమయంలో అక్కడ బిడ్డ తండ్రి ఉండడంతో ఆ చిన్నారిని ప్రమాదం నుంచి రక్షించాడు.

బయటకు తీసిన తర్వాత పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలిసింది.

జులై 19న జరిగిన ఈ సంఘటనపై హార్లింగ్ టన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారి లారీ మూర్ స్పందించారు.ఈ ఘటనతో పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం తెలియజేస్తోందని వెల్లడించారు.పిల్లవాడి తల్లిదండ్రుల గురించిన వివరాలు తమకు తెలియవన్నారు.

వారిపై ఎలాంటి అభియోగాలు మోపలేదని పేర్కొన్నారు.బిడ్డను సకాలంలో కాపాడిన తండ్రిని తాము అభినందిస్తున్నట్లు తెలిపారు.

“దయచేసి ప్రతి ఒక్కరూ తమ బిజీ దైనందిన జీవితంలో వేగాన్ని తగ్గించి, తలుపులు లాక్ చేసి వెళ్ళిపోయే ముందు వారి వాహనాల వెనుక సీటును తనిఖీ చేయాలని నేను అందరికీ గుర్తు చేయాలనుకుంటున్నాను” అని ఆయన చెప్పారు.“పిల్లల శరీర ఉష్ణోగ్రత పెద్దవారి కంటే మూడు నుండి ఐదు రెట్లు వేగంగా పెరుగుతుంది.పిల్లలను వాహనంలో వదిలిపెట్టినప్పుడు, ఆ పిల్లల ఉష్ణోగ్రత( Temperature ) త్వరగా పెరుగుతుంది.పరిస్థితి త్వరగా ప్రమాదకరంగా మారుతుంది.” అని పేర్కొన్నారు.ఫలితంగా కొద్ది సేపటిలోనే పిల్లలు చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube