రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు మత్తడి నుండి నీరు ప్రమాదకరంగా దూకుతుండడంతో ప్రజల భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మానేరు డ్యామ్ ను చూడడానికి ఎవరిని అనుమతించడం లేదని, దూర ప్రాంతాల నుండి, చుట్టుపక్కల, పరిసర ప్రాంతాల నుండి వచ్చే సందర్శకులపై ఆంక్షలు విందించడమైందని ఈ సందర్భంగా గంభీరావుపేట ఎస్ఐ మహేష్ తెలిపారు.ఎవరు కూడా ఎగువ మానేరు వద్దకు రాకూడదని, ప్రస్తుతానికి రాకపోకలు నిలిపివేశామని , ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలియజేశారు.







