భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీని కలిసినట్లుగా జలగం వెంకట్రావు తెలిపారు.ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి హైకోర్టు తీర్పు కాపీని అందజేసినట్లు పేర్కొన్నారు.
తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని అసెంబ్లీ కార్యదర్శిని కోరానన్నారు.కాగా తప్పుడు అఫిడవిట్ కేసులో నిన్న వనమాపై హైకోర్టు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో హైకోర్టు తీర్పును అమలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని కలిశామన్నారు.గతంలో కేసీఆర్ నాయకత్వంలో పని చేశానన్న జలగం ఇప్పుడూ పని చేస్తానని స్పష్టం చేశారు.







