అవును, మీరు విన్నది నిజమే.ఇదో అరుదైన, అద్భుతమైన ఘటన.
కొమురం భీం ఆసిపాబాద్ జిల్లా అడవుల్లో అరుదైన పుట్టగొడుగులను కనుగొన్నారు అధికారులు.కాగజ్ నగర్ పరిధిలోని వేంపల్లి ( Vempalli )రేంజ్ అటవీ ప్రాంతంలో ఏకంగా న్యూజిలాండ్ కరెన్సీ మీద దర్శనమిచ్చే పుట్టగొడుగులు తళుక్కుమనడంతో సర్వత్రా ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది.
ఇవి అరుదైన జాతికి చెందినవిగా చెబుతున్నారు.ఇలాంటి నీలి పుట్టగొడుగులు అక్కడ తప్ప ఇంకెక్కడా లభించవని, కాగా ఇపుడు మనదగ్గర అలాంటివి కనిపించడం చాలా ఆశ్చర్యంగా ఉందని అటవిశాఖ అధికారులు అంటున్నారు.
ఈ స్కైబ్లూ మష్రూమ్స్ ఇటీవలే మొలిచినట్లు వేంపల్లి రేంజ్లోని ఓ అటవీశాఖ అధికారి తెలిపారు.

ఇకపోతే, 1989లో ఒడిశా రాష్ట్రంలో వీటిని భారతదేశంలో మొదటి సారిగా గుర్తించినట్లు చెబుతున్నారు.ఈ స్కైల్లూ మష్రూమ్స్( Skylloo Mushrooms ) పుట్టగొడుగులకు న్యూజిల్యాండ్( New Zealand ) పుట్టినిల్లు కావడంతో.ఆ దేశపు కరెన్సీ నోటుపై వీటి చిహ్నం చాలా కామన్ గా కనబడుతుంది.
న్యూజిలాండ్ దేశపు $50 నోటు మీద వీటి బొమ్మ కనిపిస్తుందని.ఈ పుట్టగొడుగులను ఆ దేశ జాతీయ ఫంగస్‌గా కూడా గుర్తించారని అధికారులు చెబుతున్నారు.
ఈ పుట్టగొడుగు ఎంతో అరుదైనది.దీనిని కాపాడుకోవడం చాలా ముఖ్యమని అటవీశాఖ అధికారి వేణుగోపాల్( Venugopal ) ఓ మీడియా వేదికగా చెబుతున్నారు.
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కవాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో నీలి పుట్టగొడుగులు విస్తృతంగా పెరుగుతున్నట్టు గుర్తించామన్నారు.

ఇకపోతే, కాగజ్ నగర్ అటవి ప్రాంతం జీవ వైవిధ్యానికి నిలయంగా మారుతోంది.ఈ పుట్టగొడుగుల శాస్త్రీయనామం ఎంటోలోమా హోచ్‌స్టెట్టెర.వీటినే ‘బ్లూ పింక్ గిల్’ లేదా ‘స్కై-బ్లూ మష్రూమ్’ ( Sky-Blue Mushroom )గా పిలుస్తారని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఈ జాతి పుట్టగొడుగులు గులాబీ, ఊదా రంగులను కలిగి ఉంటాయని తెలుస్తోంది.జూలై 20న కవ్వాల్ టైగర్ జోన్ అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న తమకు ఈ పుట్టగొడుగులు కనిపించాయని కాగజ్ నగర్ డివిజనల్ పారెస్ట్ అదికారి తెలిపారు.
అయితే వీటిని ఆహారంగా మాత్రం తీసుకోరు.ఎంటోలోమా జాతులు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలతో కూడిన బయోయాక్టివ్‌లను కలిగి ఉంటాయని సమాచారం.







