పవన్ పై తెలుగు దేశం తక్షణ కర్తవ్యం ఏమిటంటే ?

2019లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన( Jana sena )పై తెలుగుదేశం అనుకూల మీడియా అనేక వ్యతిరేక కథనాలు ప్రసారం చేసేది.పవన్ కళ్యాణ్ ను ఒక నిలకడ లేని వ్యక్తిగా చూపించడానికి ఇతోధికం గా కృషి చేసేది.

 Is Tdp Ready For Plan-b On Pawan, Jana Sena , Pawan Kalyan , Tdp , Ycp,-TeluguStop.com

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి వాటికి విపరీతంగా ప్రజాధరణ వచ్చినా కూడా వాటి గురించి కనీసం నామమాత్రంగా కూడా లైవ్ టెలికాస్ట్ చేయకపోవడం గమనార్హం.అయితే ఏప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చబోనని పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటించా రో అప్పటినుంచి పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ప్రతి కదలికను మీడియా విపరీతంగా కవర్ చేస్తుంది.

ముఖ్యంగా వారాహి తొలి దశ ,మలిదశ యాత్రలకు నభూతో అన్న రీతిలో మీడియా కవరేజ్ దక్కింది.అయితే ఇందులో పవన్ కళ్యాణ్ పై కొత్తగా పుట్టుకొచ్చిన అభిమానం ఏమీ లేదు కానీ ప్రభుత్వ వ్యతిరేకతను పవన్ తారాస్థాయికి తీసుకెళ్తారని, ప్రజలు పవన్ మాటలను శ్రద్ధగా గమనిస్తున్నారు అన్న విషయాన్ని గమనించే మీడియా ఈ విధంగా టర్న్ తీసుకుందని చెబుతారు .

<img src="

Telugu Ap, Chandra Babu, Jana Sena, Pawan Kalyan-Telugu Top Posts

“/>

అయితే ఇప్పుడు జనసేన వర్సెస్ వైసీపీ( YCP )గా విషయం మారిన తర్వాత పవన్ కళ్యాణ్ వైఖరిలో వస్తున్న స్పష్టమైన మార్పును గమనిస్తున్న తెలుగుదేశం వర్గాలు ఇప్పుడు తల పట్టుకున్నట్లుగా తెలుస్తుంది .ఇప్పటివరకు ఎట్టి పరిస్థితిల లోనూ పవన్ పొత్తుకు అంగీకరిస్తారని తాము నిర్దేశించిన రీతిలోనే పొత్తుకు ఒప్పుకుంటారని భావించిన తెలుగుదేశం వర్గాలు ఇప్పుడు పవన్ డ్రైవింగ్ సీట్ తీసుకోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలోకి వచ్చారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి .

Telugu Ap, Chandra Babu, Jana Sena, Pawan Kalyan-Telugu Top Posts

అంతేకాకుండా ఎన్డీఏతో పూర్తిస్థాయిలో సఖ్యత ప్రదర్శించడం, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డిఏ ప్రభుత్వ ఏర్పాటు చేస్తుందని ప్రకటించడం, తెలుగుదేశం( TDP ) పొత్తులకు సంబంధించి ఏ విధమైన వ్యాఖ్యలు ఇటీవల కాలంలో చేయకపోవడంతో పవన్ విషయంలో ప్లాన్ బి రెడీ చేసి పెట్టుకోకపోవడం వ్యూహాత్మక తప్పిదంగా ఇప్పుడు తెలుగుదేశం వర్గాలు వాపోతున్నాయట.ప్రజారాజ్యం సమయం నుంచి పాలిటిక్స్ ను నిశితం గా గమనిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిస్థాయిలో రాటుదేలారని ప్రజల నాడిని అర్థం చేసుకున్న పవన్ వ్యూహాత్మకంగానే మీడియాను ఉపయోగించుకుంటున్నారని ఇప్పుడు పూర్తిస్థాయిలో రాజకీయ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న తర్వాత పొత్తుపై తనదే అప్పర్ హ్యాండ్ గా ఉండాలన్న భావన లో పవన్ ఉన్నారని తెలుస్తుంది.

పొత్తులో 50 కి తగ్గకుండా అవికూడా తమకు అనుకూల నియోజక వర్గాలే అయ్యి వుండాలనే ముఖమైన షరతులతో పవన్ పొత్తు చర్చలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది మరి ఇప్పటికైనా తెలుగుదేశం పవన్ విషయంలో ప్లాన్ బి రెడీ చేసుకుంటుందో లేదో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube