ఆగస్టు 01 బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో "ఠాణా దివస్"

బోయినపల్లి పోలీస్ స్టేషన్లో( Boinapally Police station ) 01-08-2023(మంగళవారం) నిర్వహించే “ఠాణా దివస్” కార్యక్రమాన్ని బోయినపల్లి మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందని,ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని, ప్రజల నుండి స్వయంగా విన్నపాలు స్వీకరించి, వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడం కోసం చేపట్టిన “ఠాణా దివస్” ( Thana Divas )కార్యక్రమంలో భాగంగా తేదీ 01-08-2023 మంగళవారం బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో ఉదయం 10:30 గంటల నుండి అందుబాటులో ఉండి మండల ప్రజల నుండి అర్జీలను స్వయంగా స్వీకరించి, దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులను,గ్రామాల్లో నెలకొన్న శాంతి భద్రతల సమస్యలను చట్టపరంగా పరిష్కరించనున్నట్లు తెలిపారు.మండల పరిధిలోని గ్రామాల ప్రజల ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు, ఫిర్యాదులను తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవలసిందిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.

 Thana Divas At Boinapally Police Station On 1st August,thana Divas,boinapally Po-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube