జతిరత్నాలు( Jathi Ratnalu ) సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అనుదిప్… ఈయన తీసిన జతిరత్నాలు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది…ఇక ఈ సినిమాతో అనుధిప్( Anudeep Kv )మంచి డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు…ఇక అలాగే ఈ సినిమా తర్వాత శివ కార్తికేయన్ హీరోగా తెలుగు, తమిళ్ భాషల్లో ప్రిన్స్ అనే సినిమా తీశారు.ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది ఇక ఇప్పుడు అనుదిప్ కి తెలుగుతో పాటుగా తమిళ్ లో కూడా మంచి అవకాశాలు అయితే వస్తున్నాయి…మరి ఆయన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నారు అనేది ఇంకా ఎవ్వరికీ తెలియడం లేదు.
అప్పట్లో వెంకటేష్ కి ఒక కథ చెప్పిన అనుదిప్ ఆ తర్వాత వెంకటేష్ తో సినిమా చేయబోతున్నారు అంటు వార్తలు వచ్చాయి.అయిన కూడా ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు.
ఇక దానితో ఈ ప్రాజెక్ట్ ఉండదు అని అందరూ అనుకున్నారు.కానీ నిజానికి వెంకటేష్, శైలేష్ కొలను డైరెక్షన్ లో చేస్తున్న సినిమా పూర్తి అయిన వెంటనే ఈ సినిమా చేస్తారు అనే టాక్ అయితే ఉంది.ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాలి…

ఇక ఇది ఇలా ఉంటే అనుదిప్ రీసెంట్ గా ఈ హీరోతో ఒక సినిమా చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఆయన ఎవరో కాదు తమిళ్ తో పాటు తెలుగులోనూ హీరోగా సూపర్ సక్సెస్ అయిన కార్తీ( Karthi ) హీరోగా ఆయన ఒక సినిమా చేస్తున్నాడు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి కానీ ఇది కూడా ఇంకా అఫిష్యాల్ గా అనౌన్స్ మెంట్ అయితే రాలేదు…

ఇక ఈ రెండు సినిమాల్లో ఆయన ఎవరితో ముందు గా సినిమా చేస్తాడు ఇక వీళ్లిద్దరూ కాకుండా ఇంకా వేరే హీరో తో సినిమా చేసే అవకాశం ఏమైనా ఉందా అనేది తెలియాలంటే మనం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు…అయితే అనుదిప్ ఇప్పటికే గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి అడ్వాన్స్ తీసుకున్నాడు అని తెలుస్తుంది…ఇక ముందుగా వాళ్ల బ్యానర్ లో సినిమా చేయాల్సి వస్తె అది కచ్చితంగా పెద్ద హీరోతోనే ఉంటుంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి…
.







