బ్రో మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనకపోయినా చిత్ర యూనిట్ మాత్రం ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాపై అంచనాలు పెంచుతోంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బ్రో సినిమా సమయానికి పరిస్థితులు అనుకూలంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
దర్శకుడు సముద్రఖని( Samudrakhani) ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పవన్ కళ్యాణ్ స్టేట్ లీడర్ కాదు నేషనల్ లీడర్ అని ఆయన చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ కు గొప్ప విజన్ ఉందని ఆయన చెప్పుకొచ్చారు.వినోదాయ సిత్తం కథ విని కేవలం పది నిమిషాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మార్చేశారని అన్నారు.
కేవలం 53 రోజుల్లో త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రీన్ ప్లేను అందించారని ఆయన పేర్కొన్నారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ నా చేయి పట్టుకుని నడిపించారని సముద్రఖని అన్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram ) తో పని చేస్తుంటే నా తండ్రి గుర్తుకు వచ్చారని ఆయన కామెంట్లు చేశారు.పవన్, సాయితేజ్ లది డిఫరెంట్ స్టైల్ అని వాళ్లను హ్యాండిల్ చేసే విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగలేదని సముద్రఖని వెల్లడించారు.తక్కువ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తైందని ఆయన చెప్పుకొచ్చారు.పవన్ యాక్టర్ కావడంతో పాటు రాజకీయాల్లో ప్రజాదరణ ఉన్న నాయకుడు అని సముద్రఖని వెల్లడించారు.

ప్రజలకు మంచి చేయాలని పవన్ కు విజన్ ఉందని సముద్రఖని చెప్పుకొచ్చారు.దేశ అభివృద్ధి కోసం పవన్ కు మంచి ప్రణాళికలు ఉన్నాయని సముద్రఖని అన్నారు.పవన్ ను చూస్తే నేషనల్ లీడర్ కంటే ఎక్కువ అనిపిస్తుందని ఆమె కామెంట్లు చేశారు.అవినీతి, అక్రమాలను రూపుమాపి భవిష్యత్తు తరం కోసం బంగారు బాట వేయాలని పవన్ భావిస్తున్నారని సముద్రఖని కామెంట్లు చేశారు.







