అడవిలో వర్షాలకు తాళలేక.. సిటీలోని ఫ్లైఓవర్‌ మీదకు వచ్చిన సింహం.. వీడియో వైరల్...

గుజరాత్‌( Gujarat )లోని జునాగఢ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ సిటీకి సమీపంలోని అడవుల్లో కూడా కుండపోత వానలు పడుతున్నాయి.

 The Lion That Came On The Flyover In The City.. The Video Is Viral... Gujarat,-TeluguStop.com

దీంతో అందులో నివసించే జంతువులు ఆ వర్షాలకు తాళలేకపోతున్నాయి.వాటి ఆవాసాలను వదిలేసి నగరాల్లోకి వస్తున్నాయి.

ఈ క్రమంలోనే జునాగఢ్‌ సిటీలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ సింహం ఫ్లైఓవర్‌పై నడుస్తూ స్థానికుల కెమెరాకు చిక్కింది.ఆ వీడియోను మాజీ క్రికెటర్ సయ్యద్ సబా కరీం ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశారు.

వీడియోలో ఆ సింహం చాలా క్యాజువల్ గా నడుస్తున్నట్లు కనిపించింది.దాని పక్కనుంచే వాహనాలు వెళ్లడం కూడా మీరు గమనించవచ్చు.

గుజరాత్ రాష్ట్రం అంతటా కురుస్తున్న వర్షాల వల్ల ఎక్కడ చూసినా వరదలు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది.ఇక అడవుల్లో నిరంతరంగా కురుస్తున్న వర్షాల వల్ల మోకాళ్ల లోతులో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

అందుకే అక్కడ ఉండలేక సింహాలు, పులులు( Lions ), ఇంకా తదితర మృగాలు సమీపంలోని నగరాల్లోకి తరలివస్తున్నాయి.

సయ్యద్ సబా షేర్ చేసిన లయన్ వీడియో తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూస్‌తో వైరల్ అయింది.దీన్ని చూసిన చాలామంది అయ్యో పాపం ఈ వానలు జంతువులని కూడా బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి అని కామెంట్ చేస్తున్నారు.“రాజు తన రాజ్యం యొక్క దుస్థితిని చూసేందుకు తిరుగుతాడు” అని ఒక యూజర్ ఈ వీడియోకి సరదాగా కామెంట్ పెట్టారు.“వన్యప్రాణులు సురక్షితంగా ఉన్నాయని, సరైన సంరక్షణ పొందుతున్నాయని ఆశిస్తున్నా.ఇది నిజంగా బాధాకరం.” అని ఇంకొకరు కామెంట్ చేశారు.

ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో( Telugu states ) కూడా వానలు దంచి కొడుతున్నాయి.ముఖ్యంగా తెలంగాణలో వరుసగా వానలు కురుస్తున్నాయి.హైదరాబాదు నగరం ఇప్పటికే ఒక చిన్నపాటి సముద్రంలా మారిపోయింది.

ఈ వర్షాల దెబ్బకు స్కూళ్లు, కాలేజీలు కూడా మూతపడ్డాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube