50 లక్షలతో ప్రారంభమై 30 కోట్లు..ఈ సీజన్ లో అసలు సిసలు బ్లాక్ బస్టర్ అంటే ఇదే!

ఈ ఏడాది ట్రేడ్ పండితుల అంచనాలు మొత్తం తలక్రిందులు అయ్యాయి, బాక్స్ ఆఫీస్ వద్ద విస్ఫోటనం సృష్టిస్తుంది అని అనుకున్న సినిమాలన్నీ బోల్తా కొట్టి భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి.కానీ అసలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త వండర్స్ ని నెలకొల్పుతూ బయ్యర్స్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టింది.అలా భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాలన్నీ కూడా చిన్న సినిమాలే అవ్వడం విశేషం.‘ఆదిపురుష్’ ఇచ్చిన నష్టాల స్ట్రోక్ కి ఇప్పట్లో తేరుకుంటామా అని ఆందోళన చెందుతున్న బయ్యర్స్ కి రీసెంట్ గా విడుదలైన ‘సామజవరగమనా’, ‘బేబీ’ చిత్రాలు కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసాయి.రెండు సినిమాలకు కూడా పెట్టిన డబ్బులకంటే పెట్టిన ప్రతీ పైసా కి 5 రెట్లు లాభాలు వచ్చాయి.ముందుగా ‘సమజవరగమనా’( Samajavaragamana Movie ) గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.

 Hero Sri Vishnu Samajavaragamana Movie Box Office Collections Details, Hero Sriv-TeluguStop.com
Telugu Adipurush, Baby, Srivishnu-Movie

వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో ఇక సినిమాలు చెయ్యడం ఆపేస్తే మంచిది అని ఆడియన్స్ చేత అనిపించుకున్న హీరో శ్రీ విష్ణు.( Hero Srivishnu ) అలాంటి హీరో నటించిన ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని బహుశా శ్రీ విష్ణు కూడా ఊహించి ఉండదు.సాధారణంగా యిలాంటి సినిమాలకు జనాలు తెహట్రెస్ కి కదలాలి అంటే కచ్చితంగా మంచి పాటలు ఉండడం తప్పనిసరి.లేదా యూత్ ని ఆకర్షించే విధంగా ఎదో ఒక మంచి ప్రమోషనల్ కంటెంట్ వదలాలి.

ఈ సినిమాకి ఆ రెండు జరగలేదు, అందువల్ల మొదటి రోజు కేవలం 50 లక్షలు రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.ఇక శ్రీ విష్ణు అదృష్టం ఇంతేనేమోలే అని అందరూ అనుకున్నారు.

టాక్ పాజిటివ్ గా వచ్చింది కదా, రెండవ రోజు నుండి అయినా పికప్ అవుతుందని అందరు అనుకున్నారు , కానీ రెండవ రోజు కూడా ఎలాంటి పికప్ లేదు.

Telugu Adipurush, Baby, Srivishnu-Movie

ఇక పాజిటివ్ టాక్ తో( Positive Talk ) కూడా ఫ్లాప్ అయిపోతుందా? అని బయ్యర్స్ ఆందోళన చెందుతున్న సమయం లో మూడవ రోజు నుండి అద్భుతమైన పికప్ ని అందుకుంది.అంతే అప్పటి నుండి రోజు రోజు కి కలెక్షన్స్ పెరుగుతూ పోయాయి.అమెరికా లో ( America ) అయితే ఈ సినిమా సెన్సేషన్ సృష్టించింది అనే చెప్పాలి.

అక్కడ ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది.ఈ చిత్రం రైట్స్ ని ఆ ప్రాంతం లో కేవలం 25 లక్షల రూపాయలకు మాత్రమే కొనుగోలు చేసారు.

కానీ ఫుల్ రన్ లో ఇండియన్ కరెన్సీ లెక్క ప్రకారం చూస్తే నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.అలాగే ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ లో 11 కోట్ల రూపాయిలు, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో కోటి రూపాయిలు, మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 16 కోట్ల రూపాయిలు షేర్ వసూళ్లు వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube