ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ”బ్రో ది అవతార్”.ఈ సినిమా ఈ వీకెండ్ ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది.
అందుకే తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో”.
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జస్ట్ గెస్ట్ రోల్ లో నటించినప్పటికీ పవర్ స్టార్ ఫ్యాన్స్ సైతం మంచి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

మొదట్లో ఇది రీమేక్ సినిమా అని ఫ్యాన్స్ కూడా గుర్రుగా ఉన్నారు.అంత హైప్ లేకుండా ఉంది.కానీ ఇప్పుడు కావాల్సినంత హైప్ వచ్చింది.
వినోదయ సీతం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సముద్రఖని డైరెక్ట్ చేస్తుండగా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఈ సినిమాను ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించగా ట్రైలర్ మొన్న రిలీజ్ అయ్యింది.

ఈ ట్రైలర్ తో అంచనాలు డబుల్ అయ్యాయి.అభిమానుల నుండి మాత్రమే కాక సాధారణ ప్రేక్షకుల నుండి కూడా ఈ ట్రైలర్( Bro Trailer ) కు మంచి రెస్పాన్స్ లభిస్తుంది.ఈ ట్రైలర్ ఆద్యంతం ఫ్యాన్ రైడ్ తో సాగింది.యూట్యూబ్ లో టాప్ లో ట్రెండింగ్ అవుతున్న ఈ ట్రైలర్ 24 గంటల్లోనే 27.2 మిలియన్ వ్యూస్ ను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఈ మేరకు మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు.
ఇక ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.కాగా ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ( Ketika Sharma ) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండగా థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఎలా ఆకట్టు కుంటుందో వేచి చూడాలి.







