విజయనగరం జిల్లాలోని వంగర మండలంలో గజరాజులు హల్ చల్ చేశాయి.కొత్తపేట మరియు దేవకినాడలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది.
రెండు గ్రామాల్లో సంచరించిన ఏనుగులు గ్రామ సమీపంలో ఉన్న వరి, చెరకు, మొక్కజొన్న పంటలను ధ్వంసం చేశాయి.గజరాజుల సంచారంతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.







