బీటెక్ చదివిన ప్రతి విద్యార్థి హ్యాపీడేస్ సినిమా( Happy Days )ను సులువుగా మరిచిపోలేరు.ఈ సినిమాలో అప్పు పాత్ర పోషించిన గాయత్రీ రావు తన నటనతో ప్రేక్షకులను మెప్పించడంతో పాటు ప్రేక్షకులకు దగ్గరైంది.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంలో అప్పు పాత్ర కూడా కీలకమనే సంగతి తెలిసిందే.అయితే తర్వాత రోజుల్లో గాయత్రీ రావు కొన్ని సినిమాలలో నటించినా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.
గాయత్రీ రావు( Gayatri Rao ) తల్లి బెంగళూరు పద్మ సైతం తెలుగులో పలు సినిమాలలో అద్భుతంగా నటించి తన నటనతో ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించారు.తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన బెంగళూరు పద్మ తన కూతురు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.కూతురు ఆస్ట్రేలియాలో ఉందని బెంగళూరు పద్మ వెల్లడించారు.
తన కూతురికి స్పోర్ట్స్( Sports ) పై మాత్రమే ఆసక్తి అని ఒక సందర్భంలో శేఖర్ కమ్ముల చూసి ఆ పాత్ర కోసం తీసుకున్నారని ఆమె చెప్పుకొచ్చారు.
టామ్ బాయ్ క్యారెక్టర్ కావడంతో జుట్టు కట్ చేయించారని ఆమె వెల్లడించారు.ఆ తర్వాత గాయత్రి ఒక హర్రర్ సినిమాలో, గబ్బర్ సింగ్ సినిమా( Gabbar Singh )లో నటించిందని బెంగళూరు పద్మ అన్నారు.
గబ్బర్ సింగ్ తర్వాత నా కూతురు చదువుకోవడానికి వెళ్లిందని బెంగళూరు పద్మ వెల్లడించారు.
గబ్బర్ సింగ్ సినిమాలో ఒకింత బోల్డ్ రోల్ లో నటించడమే ఆమె పాలిట శాపమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మొదట ట్రయాంగిల్ లవ్ స్టోరీలా గబ్బర్ సింగ్ లో తన రోల్ గురించి చెప్పారని ఆ పాత్ర మరోలా ఉందని బెంగళూరు పద్మ వెల్లడించారు.గాయత్రీ రావు తల్లి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
గాయత్రీరావును నమ్మించి మోసం చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.