Bro Trailer Review : బ్రో మూవీలో భారీగా మార్పులు.. అయినా తప్పులు వెతుకుతున్న నెటిజన్స్?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ), యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసిన నటించిన తాజా చిత్రం బ్రో( Bro Movie ).ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

 Many Changes In Bro Movie Compare With Original Vinodhaya Sitham What Changes L-TeluguStop.com

ఇందులో సాయి ధరమ్ తేజ సరసన కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోంది.అలాగే ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ కూడా కీలకపాత్రలో నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో మాస్ కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఉన్నట్లు ఇప్పటికే ట్రైలర్ను చూస్తే అర్థమవుతోంది.

ట్రైలర్ రావడంతో ప్రేక్షకులకు కూడా ఈ సినిమాపై ఒక క్లారిటీ వచ్చేసింది.దీంతో మాతృకకి, ఒరిజినల్‌ కి మధ్య పోలీకలను వెతుకుతున్నారు ఆడియెన్స్.కాగా తమిళంలో హిట్‌ అయిన వినోదయ సీతం సినిమాకు రీమేక్‌( Vinodhaya Sitham ) గా బ్రో మూవీ రూపొందిన విషయం తెలిసిందే.

సముద్రఖని( Samuthirakhani ) దర్శకత్వం వహిస్తూ ఆయనే దేవుడుగా నటించారు.తంబిరామయ్య ముఖ్య పాత్ర పోషించారు.ఫ్యామిలీ డ్రామాగా, ఆద్యంతం ఎమోషనల్‌గా ఆ సినిమా సాగుతుంది.కానీ తెలుగులో చాలా మార్పులు చేశారు.

పవన్‌ కళ్యాణ్‌ ఎంట్రీతో ఆయన మార్క్ అంశాలను జోడించారు.పైగా సినిమా స్కేల్‌ కూడా మారిపోయింది.

బ్రో ని పెద్ద రేంజ్ లో తెరకెక్కించారు.తెలుగులో సముద్రఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్‌ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్‌ ప్లే అందించారు.

మాటల మాంత్రికుడు( Trivirkam Srinivas ) స్క్రిప్ట్ లో ఎంట్రీతో చాలా మార్పులు జరిగిపోయాయి.మరి ఆ మార్పులేంటి? అన్న విషయానికి వస్తే.

తమిళంలో సూపర్ హిట్ అయినా వినోదయ సీతం సినిమాలో ప్రధాన పాత్రల్లో సముద్రఖని, తంబిరామయ్య నటించారు.సముద్రఖని టైమ్‌గా, తంబిరామయ్య బ్యాంక్‌ మేనేజర్‌గా నటించారు.త్వరలో రిటైర్‌మెంట్‌ కాబోతాడు.తన ఫ్యామిలీనే సర్వస్వం అనుకునే తంబిరామయ్యకి ముగ్గురు పిల్లలు.వారిని సెటిల్‌ చేయాలనేది ఆయన ఆశ.కానీ అనూహ్యంగా ప్రమాదంలో చనిపోతాడు.దీంతో ఆయనలో దిగులు ఫ్యామిలీని సెట్‌ చేయకుండానే చనిపోయానే, ఒక్క అవకాశం ఉంటే అంతా సెట్‌ చేసేవాడిని అను బాధ పడుతున్న క్రమంలో సముద్రఖని వచ్చి నెల రోజులు టైమ్ ఇస్తాడు.ఆ తర్వాత అసలు లైఫ్‌ కనిపిస్తుంది తంబిరామయ్యకి.

అదేంటనేది సినిమా.కానీ బ్రో సినిమాలో కొంత మార్పులు చేశారు.

ఇందులో టైమ్‌గా పవన్‌ కళ్యాణ్‌ నటించారు.తంబిరామయ్య పాత్రలో సాయిధరమ్‌ తేజ్‌( Sai Dharam Tej ) నటించారు.

ఇందులో ఒక కంపెనీ సీఈవోగా కనిపించబోతున్నారు సాయి.పవన్‌ కళ్యాణ్‌ పాత్ర లెంన్త్ ని ఇందులో పెంచారు.ఆయనకు పాటలు డాన్సులు పెట్టారు.తమిళంలో అవేవీ ఉండవు.ఒక మాంటేజ్‌ సాంగ్ మాత్రమే ఉంటుంది.బ్రో మూవీలో మూడు పాటలు, ఒక ప్రమోషనల్‌ సాంగ్ ఉంది.

అందులో ఇప్పటికే రెండు పాటలు విడుదలైన విషయం తెలిసిందే.అలాగే ఇందులో సాయికి లవ్‌ ట్రాక్‌ ఉంది.

కేతిక శర్మ( Ketika Sharma ), ప్రియా ప్రకాష్‌ వారియర్‌లు నటించారు.గ్లామర్‌ సైడ్ యాడ్‌ చేశాడు.

తమిళంలో ఫైట్లు ఉండవు, కేవలం ఎమోషన్స్ మాత్రమే, ఇందులో ఫైట్స్ కూడా పెట్టారు.మాస్‌ ఎలిమెంట్లు జోడించారు.

తమిళంలో పెళ్లీడుకొచ్చిన తంబిరామయ్య పిల్లలు చుట్టూ కథ తిరిగితే, ఇందులో పెళ్లికాని సాయిధరమ్‌ తేజ్‌ వ్యాపారం, ప్రేమ చుట్టూ తిరుగుతుంటుంది.వినోదయ సిత్తం మూవీ కేవలం 99నిమిషాలు ఉంటుంది.

కానీ బ్రో మూవీ రెండు గంటల 16 నిమిషాలు ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube