మొదటి భార్య రిల్స్ వీడియోస్ చూస్తున్న భర్త మర్మాంగాలను కోసేసిన రెండో భార్య..!

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని దారుణాలను చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తాయి.కొందరు వ్యక్తులు అలా కావాలని చేస్తారో లేదంటే కోపంలో ఏదో ఒకటి చేయాలని అలా చేస్తారో తెలియదు.

 The Second Wife Cut The Husband's Secrets While Watching The Videos Of The First-TeluguStop.com

అసలు విషయం ఏమిటంటే.? ఒక యువతి ఒక వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది.ఆ వ్యక్తి తన మొదటి భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ ( First Wife Instagram Reels )చూస్తున్నాడు అనే కోపంతో భర్త అని కూడా చూడకుండా ఏకంగా అతని మర్మాంగాలను కోసేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చోటుచేసుకుంది.అసలు వివరాలు ఏమిటో చూద్దాం.

Telugu Anand Babu, Reels, Latest Telugu, Nandigama Ntr-Latest News - Telugu

వివరాల్లోకెళితే.ఎన్టీఆర్ జిల్లా నందిగామ లోని ముప్పాళ్ళ గ్రామంలో కోట అనంతబాబు నివాసం ఉంటున్నాడు.ఇతనికి వివాహం అయ్యి ఏవో కుటుంబం మనస్పర్ధల వల్ల మొదటి భార్యతో విడిపోయాడు.ఆ తర్వాత కొన్ని రోజులకు వరమ్మ( Varamma ) అనే మహిళను పెళ్లి చేసుకుని ముప్పాళ్ళ గ్రామంలో నివాసం ఉంటున్నాడు.

వీరి సంసారం ఎటువంటి కలహాలు లేకుండా బాగానే ఉంది కానీ శుక్రవారం రాత్రి ఆనంద్ బాబు తన మొదటి భార్య ఇన్స్టాగ్రామ్ వీడియోలను చూస్తూ ఉండడం రెండవ భార్య వరమ్మ కు నచ్చలేదు.

Telugu Anand Babu, Reels, Latest Telugu, Nandigama Ntr-Latest News - Telugu

తనను పెళ్లి చేసుకుని మొదటి భార్య వీడియోలు ఎందుకు చూస్తున్నావ్ అని భర్తపై గొడవ పడింది.కాసేపు ఈ దంపతుల మధ్య మాటల యుద్ధంతో పాటు ఒకరినొకరు కొట్టుకునే వరకు వాగ్వాదం పెరిగింది.క్షణికావేశంలో వరమ్మ తన భర్త ఆనంద్ బాబు( Anand Babu ) మర్మాంగాలను బ్లేడుతో కోసేసింది.

వెంటనే ఆనంద్ బాబుకు తీవ్ర రక్తస్రావం కావడంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు.అక్కడి నుంచి మెరుగైన వైద్యం కొరకు విజయవాడకు తీసుకెళ్లారు.ఈ విషయం నుంచి రెండో భార్య వర్మ మీడియాతో మాట్లాడుతూ.ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు తనకు గాయాలు అయ్యేలా భర్త కొట్టాడని తెలుపుతూ.

అలా దెబ్బ తగులుతుంది అని తాను అనుకోలేదని అసలు ఎలా జరిగిందో కూడా తనకు తెలియదని సడన్గా అలా జరిగిపోయిందని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube