రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం లో గత అయిదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలం అవుతుంది.దీనికి తోడు ఈదురుగాలులు వీస్తుండటాగా చలికి ఎవరు బయటకు రావడం లేదు.
అయిదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బోయినపల్లి మండల కేంద్రం నుండి వేములవాడ వెళ్లే రహదారి పై ఉన్న బోయినపల్లి కల్వర్టు, గంజివాగు పై నుండి వెళ్తుండటం తో రాక పోకలు నిలిచి పోయాయి.అలాగే మండల కేంద్రం నుండి కోదురుపాక వైపు వెళ్లే కల్వర్టు పై నుండి వెళ్తుండటం తో రాక పోకలకు అంతరాయం కలుగుతుంది.
మరో వైపు శ్రీ రాజ రాజేశ్వర జలాశయం నుండి లోయర్ మన డ్యాంకు ఆరు గేట్లు ఎత్తి 9000 క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు.జలాశయం సామర్ధ్యం 27.5 టి ఏం సి లు కాగ ప్రస్తుతం జలాశయం లో 15.51నిలువ ఉండగా ప్రస్తుతం వర్షాల వల్ల 4500 క్యూసెక్కుల జలాశయం కు చేరుతుంది.కోరేం చెరువు జలకళ సంతరించుకుని మత్తడి దుంకుతుంది.కాగ బోయినపల్లి వాగు పొంగి పోర్లడం తో ముదిరాజ్ కులస్తులు చేపలు పట్టడం లో నిమగ్నం అయ్యారు.