కూతురికి ఫస్ట్ టైమ్ పీరియడ్స్ వచ్చాయని సెలబ్రేషన్స్.. కేక్ కట్ చేసి మరీ..

యువతులు, మహిళలకు నెలసరి వస్తూ ఉంటుంది.ప్రతి నెలా పీరియడ్స్( Periods ) వస్తూ ఉంటాయి.

 Parents Celebrates Daughters First Period In Uttarakhand Details, Daughters, Per-TeluguStop.com

అమ్మాయిల రజస్వల అయిన దగ్గర నుంచి పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి.అయితే తమ కూతురికి మొదటిసారి పీరియడ్స్ వస్తాయని తల్లిదండ్రులు పెద్ద ఫంక్షన్ చేశారు.

బంధువులందరినీ పిలిచి వేడుక చేశారు.ఉత్తరాఖండ్‌లో( Uttarakhand ) ఈ ఘటన చోటుచేసుకుంది.

ఉత్తరాఖండ్‌లోని డెహ్రూడన్‌కి చెందిన జితేంద్ర భట్( Jitendra Bhatt ) దంపతుల కూతురు తొలిసారి రజస్వల కాగానే పెద్ద వేడుక నిర్వహించారు.కూతురికి రుతుక్రమం గురించి వివరించడంతో పాటు దాని గురించి సిగ్గుపడాల్సింది ఏమీ లేదని చెప్పారు.

తొలిసారి రజస్వల కాగానే ఇంటికి పిలిచి ఘనంగా ఆహ్వానించారు.కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు.

దీనికి సంబంధించిన ఫొటోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సమాజంలో రుతుక్రమంపై నెలకొన్న అపోహలను తొలగించాలనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.

Telugu Periods, Daughters, Jitendra Bhatt, Latest-Latest News - Telugu

సమాజంలో నెలసరి వచ్చినప్పుడు మహిళలపై వివక్ష చూపుతున్నారు.దానిని ఏదో కీడుగా భావించి శుభకార్యాలకు ఆహ్వానించకపోవడం లాంటివి చేస్తున్నారు.ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో అలాంటి వివక్ష కొనసాగుతోంది.పీరియడ్స్ వచ్చినప్పుడు శుభకార్యాలు, ఇతర పనులు వేటికి వెళ్లరు.దీనిని ఒక మూఢనమ్మకంగా ఇప్పటికీ అనుసరిస్తూ ఉన్నారు.దీంతో అభ్యుదయ భావాలు కలిగిన ఈ తల్లిదండ్రులు ఆ అపోహలను తొలగించేదుంకు ఇలా వినూత్నంగా ట్రై చేశారు.

Telugu Periods, Daughters, Jitendra Bhatt, Latest-Latest News - Telugu

వీరిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.ఇలాంటి జంట ఊరుకోకటి ఉండాలని వ్యాఖ్యానిస్తున్నారు.మరికొందరు మాత్రం దీనిని ఆశ్చర్యంగా చూస్తున్నారు.కేక్ కట్ చేయడం ఏంటని పెదవి విరుస్తున్నారు.ఎక్కువమంది మాత్రం పాజిటివ్ గా స్పందిస్తున్నారు.సమాజంలో మహిళలపై ఉన్న వివక్ష పోవాలంటే ఇలాంటివి చేయాల్సిందేనని అంటున్నారు.

దూరాచారాలు, మూఢనమ్మకాలను ఇప్పటికైనా విడనాడాలని, ఆధునిక ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube