కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవ్వాల్సినవి కొన్ని లక్కీ ఫ్యాక్టర్స్ కలిసొచ్చి సూపర్ హిట్స్ గా నిల్చిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.అలాంటి సందర్భం ఒకటి యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) విషయం లో జరిగింది.
మొదటి ఆట నుండే డిజాస్టర్ ఫ్లాప్ తెచ్చుకున్న ఆ సినిమా కేవలం పవన్ కళ్యాణ్ కారణంగా ఎబోవ్ యావరేజి గా నిల్చింది.ఆ సినిమా మరేదో కాదు.ఎన్టీఆర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ‘దమ్ము’( dammu ) చిత్రం.‘సింహా’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి శ్రీను వెంటనే చేసిన సినిమా ఇది.ఎన్టీఆర్ లాంటి ఊర మాస్ హీరో తో బోయపాటికి శ్రీను లాంటి డైరెక్టర్ కలిస్తే అంచనాలు ఏ రేంజ్ లో ఉండేవో మన అందరికీ తెలిసిందే.విడుదలకు ముందు ఈ సినిమాకి సంబంధించిన పాటలు హిట్ అయ్యాయి.
అలాగే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ , ట్రైలర్ ఇలా ప్రతీ ఒక్క దానికి ఆరోజుల్లో బంపర్ రెస్పాన్స్ వచ్చింది.
ఫలితంగా ఈ సినిమా పై కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి.కానీ ఆ అంచనాను అందుకోవడం లో ఈ సినిమా విఫలం అయ్యింది.మొదటి ఆట నుండే నుండే ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ దుమ్ము లేచిపోయాయి.
ఆరోజుల్లో ఈ చిత్రం మొదటి రోజు ఆల్ టైం రికార్డు ని నెలకొల్పింది.కాని రెండవ రోజు నుండి వసూళ్లు తగ్గిపోతూ వచ్చాయి.ఈ చిత్రం విడుదలైన రెండు వారాలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ‘గబ్బర్ సింగ్’ చిత్రం వచ్చింది.ఈ సినిమా ఇండస్ట్రీ ని ఆ రోజుల్లో ఎలా దున్నేసిందో మన అందరికీ తెలిసిందే.
అప్పటి వరకు సరైన హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్ కెరీర్ ని ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని రేంజ్ లో మలుపు తిప్పింది.ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు కేవలం గబ్బర్ సింగ్( Gabbar Singh ) నిర్మాతకు మాత్రమే కాదు , దమ్ము చిత్ర నిర్మాతకు కూడా బాగా కలిసొచ్చింది.
ఈ సినిమాకి సుమారుగా 50 రోజుల వరకు ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో హౌస్ ఫుల్స్ పడ్డాయి.ఈ చిత్రానికి టికెట్స్ దొరకని వాళ్లంతా ‘దమ్ము’ సినిమాకి వెళ్లారు.ముఖ్యంగా కంప్లెక్స్ థియేటర్స్ లో దమ్ము చిత్రం ‘గబ్బర్ సింగ్’ వల్ల భలే లాభపడింది.‘గబ్బర్ సింగ్’ చిత్రానికి టికెట్స్ దొరకని వాళ్ళు, వెంటనే పక్క థియేటర్ లో ఆడుతున్న దమ్ము చిత్రానికి వెళ్లిపోయే వారు .ఆలా ‘గబ్బర్ సింగ్’ వల్ల దమ్ము చిత్రానికి అదనంగా రెండు వారాల వరకు రన్ వచ్చింది.ఫుల్ రన్ లో 35 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లను రాబట్టింది.
ముఖ్యం గా నెల్లూరు సిటీ వంటి ప్రాంతాలలో ‘గబ్బర్ సింగ్’ ఓవర్ ఫ్లో ‘దమ్ము’ కి బాగా కలిసొచ్చింది.