వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత్- వెస్టిండీస్( West Indies ) మధ్య తాజాగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లను కోల్పోయి 288 పరుగులు చేసింది.భారత జట్టు ఓపెనర్ లైన యశస్వి జైస్వాల్ 57, రోహిత్ శర్మ 80 పరుగులతో హాఫ్ సెంచరీ చేసి పెవిలియన్ చేరారు.
శుబ్ మన్ గిల్ 10, ఆజింక్య రహనే 8 పరుగులతో పెవిలియన్ చేరి నిరాశపరిచారు.ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీ కెరియర్ లో ఒక మైలురాయి.
తన 500వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం.ఈ మ్యాచ్ లో కోహ్లీ 87 పరుగులతో ఆఫ్ సెంచరీ చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.
భారత్ స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోతున్న సమయంలో ఎంతో ఓర్పుగా విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.రవీంద్ర జడేజా తో కలిసి విరాట్ కోహ్లీ 106 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు.
రవీంద్ర జడేజా( Ravindra Jadeja ) 36 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు.రెండవ రోజు కూడా విరాట్ కోహ్లీ( Virat kohli ) ఎంతో ఓర్పుగా కీలక ఇన్నింగ్స్ ఆడాలని ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ ను అభినందిస్తూ వెస్టిండీస్ దిగ్గజం కోట్ని వాల్ష్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.భారత్ తరపున అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ఉంటాడని వ్యాఖ్యానించాడు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత క్రికెటర్లలో విరాట్ కోహ్లీ టాప్ -4 లో తప్పక ఉంటాడని చెప్పాడు.అంతే కాకుండా విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు వెస్టిండీస్ పర్యటనకు భారత్ వచ్చిందని, అప్పుడు తాను వెస్టిండీస్ చీఫ్ సెలెక్టర్ గా ఉన్నానని కొట్ని వాల్ష్ గుర్తుకు తెచ్చుకున్నాడు.

అప్పుడు తాను కోహ్లీతో మాట్లాడిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయని, కోహ్లీ ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడని తెలిపాడు.కోహ్లీ లక్ష్యం ఒకటే ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా మారాలనేదే అని చెప్పాడు.కోహ్లీ ఇంకా ఎన్నో అద్భుతమైన రికార్డులు సృష్టిస్తాడని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.







