విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి అందమైన దృశ్యాలు చూసి చాలా సంతోషిస్తాం.ముఖ్యంగా విదేశీ వంటకాలు అంటే చాలా మంది పర్యాటకులు చెవి కోసుకుంటారు.
లొట్టలు వేసుకుని వాటిని ఆస్వాదిస్తారు.ఇక అరబ్ దేశాలకు వెళ్లినప్పుడు వారి తినే ఆహార పదార్థాలను చూసి అంతా మైమరిచిపోతారు.
అక్కడ అందరూ లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు.ముఖ్యంగా ఆహార పదార్థాలకు బంగారు రంగు పూత( Gold Plating ) పూస్తారు.
వీటి ఖరీదు చాలా చాలా ఎక్కువ.అయినా వాటికి చాలా ప్రత్యేకత ఉంటుంది.
వాటిని తినడానికే చాలా మంది టూరిస్టులు అక్కడికి వెళ్తుంటారు.ఇలాంటి ఆహార పదార్థాలు తినాలంటే ఇక ఏ మాత్రం మనం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.

మన దేశంలోనే ముఖ్యంగా మన రాష్ట్రంలోనే వీటిని తినొచ్చు.హైదరాబాద్‌లో( Hyderabad ) మనకు ఇలాంటి బంగారు రంగు పూతతో కూడిన ఆహార పదార్థాలు లభిస్తున్నాయి.వాటి గురించిన ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.హైదరాబాదు చాలా కాలంగా మంచి ఆహారం కేంద్రంగా పేరు పొందింది.ఇక్కడ లభించే హలీమ్, బిర్యానీ చాలా మందికి ఇష్టం.అంతేకాకుండా ప్రతి వీధిలో లభించే స్ట్రీట్ ఫుడ్( Street Food ) తిని చాలా మంది మైమరిచిపోతుంటారు.
ఏది ఏమైనప్పటికీ, ఈ సందడిగా ఉండే ఆహార పదార్థాల మధ్య ఊహించని కాంబినేషన్‌లతో కూడిన ఫుడ్ మనలను బాగా ఆకట్టుకుంటోంది.

ముఖ్యంగా నగరంలో మనకు ఇక బంగారు రంగుతో కూడిన ఇడ్లీలు( Gold Idlis ) లభిస్తాయి.రెండు ఇడ్లీల ధర 50 లేదా 60 ఉంటుందని అనుకుంటే పొరపాటే.వీటి ధర రూ.1200లు. వీటిని తినలాంటే బంజారాహిల్స్‌లోని కృష్ణ కేఫ్‌కి( Krishna Cafe ) వెళ్లాల్సి ఉంటుంది.
అంతేకాకుండా దీనికి నగరంలో మరో రెండు బ్రాంచీలు ఉన్నాయి.సికింద్రాబాద్, కోఠి ప్రాంతాల్లోని కృష్ణ కేఫ్‌కి వెళ్లినా మనకు నోరూరించే ఆహార పదార్థాలు లభిస్తాయి.
ఇడ్లీలు మాత్రమే కాకుండా బంగారు రంగు పూతతో కూడిన దోసె, గులాబ్ జామూన్, భజ్జీలు, మలై ఖోవా, గులాబ్ జామూన్ బన్ ఇలా మనకు ఎన్నో రుచులు లభిస్తాయి.







