2024 ఎన్నికల్లో టఫ్ ఫైట్ జరిగేలా కనిపిస్తోంది.విపక్షాలన్నీ ఏకమై వచ్చినా తనకు భయం లేదని, ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటామని ధీమాగా చెబుతోంది.
ఏపీ అధికార పార్టీ వైసిపి.జనసేన, బిజెపిల కు ఉమ్మడి శత్రువుగా ఉన్న వైసీపీని ఓడించేందుకు ఈ మూడు పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని ఇటు టిడిపి అధినేత చంద్రబాబు, అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నా, బిజెపి మాత్రం ఈ విషయంలో ఇంకా ఏ క్లారిటీ కి రాలేదు.
ఈ మూడు పార్టీలు కలిస్తే 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని వైసిపిని ఓడించగలుగుతామని చంద్రబాబు ,పవన్ బిజెపిపై ఒత్తిడి చేస్తూ అనేక మార్గాల ద్వారా పొత్తు ప్రయత్నాలు చేస్తున్నా, అవేమి ఫలించడం లేదు.వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీ మాత్రమే పోటీ చేస్తాయని ఇప్పటికే బీజేపీ ప్రకటించింది.
అయితే ఇప్పుడిప్పుడే బీజేపీ వైఖరి లో మార్పు కనిపిస్తున్నట్లుగా సంకేతాలు వెలబడుతున్నాయి.

ఇటీవల ఢిల్లీకి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) టిడిపి తో పొత్తు అంశాన్ని బిజెపి అగ్ర నాయకుల వద్ద ప్రస్తావించారట.దీనికి తోడు అనేక సర్వే రిపోర్ట్ లలోనూ ఈ విషయం తేలడాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.ఇప్పటికిప్పుడు టిడిపితో పొత్తుకు బిజెపి అంగీకరించకపోయినా, ఎన్నికల సమయం నాటికి పొత్తు పెట్టుకునే విధంగానే సంకేతాలు వెలబడుతున్నాయి.
ఈ మేరకు పవన్ కళ్యాణ్ మాటలను బట్టి ఈ విషయం అర్థమవుతుంది.టిడిపి , బిజెపి మధ్య గ్యాప్ తగ్గించేందుకు పవన్ అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు.వైసిపి వ్యతిరేక ఓటును చీలకుండా చూసేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు.అందుకే చంద్రబాబు తరఫున పవన్ రాయబారాలు చేస్తూ, బిజెపి అగ్రనేతలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా నియమితులైన దగ్గుబాటి పురందరేశ్వరి( Daggubati Purandeswari ) సైతం బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి వైసిపి ప్రభుత్వం చేసుకుంటూ అనేక విమర్శలు చేస్తూనే, అనేక నివేదికలను తెరపైకి తెస్తున్నారు.ఇప్పటి వరకు ఏపీకి కేటాయించినా, ఆ నిధులను ఏపీ ప్రభుత్వం వేరే వేరే పథకాలకు ఏ విధంగా మళ్ళించింది అనే అనేక అంశాలతో పాటు , రాజకీయ విమర్శలు చేస్తున్నారు.అయితే ఎక్కడా టిడిపిపై విమర్శలు చేయడం లేదు.కనీసం టిడిపి, వైసిపిలను సమాన దూరంలో ఉంచుతామనే విషయాన్ని ప్రకటించడం లేదు.దీంతో రానున్న రోజుల్లో టిడిపి తో పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉంటుందని ముందుగా అంచనా వేయడంతోనే , ఈ విధంగా బిజెపి వ్యవహరిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.







