వాలంటీర్లు చేసే తప్పుఒప్పులకు బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తీసుకుంటుందని ప్రకటించారు ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ .వాలంటీర్లు రాజ్యాంగ బద్దంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ అని ఈ వ్యవస్థలో జరిగే పొరపాట్ల కు ప్రభుత్వం కచ్చితంగా బాధ్యత భావిస్తుందని ఆయన ప్రకటించారు.
ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చే పిర్యాదులకు ఏ విధంగా అయితే ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందో అదే పద్ధతి వాలంటీర్లకు కూడా అమలవుతుందని ఆయన ప్రకటించారు., వాలంటీర్లు తీసుకుంటున్న డేటా పై ఇంత రచ్చ చేస్తున్న పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ఆ డేటా ఎక్కడ దుర్వి నియోగం అవుతుందో కూడా వివరిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు.
కేవలం రాజకేయ దురుద్దేశాలతో విమర్శలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. .

ప్రజలకు సంక్షేమ పథకాలు( Welfare schemes ) అమలు చేయడానికి మాత్రమే డేటా తీసుకుంటున్నాము తప్ప మరే ఉద్దేశము ప్రభుత్వానికి లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు .పవన్ కళ్యాణ్ కేంద్రంతో సత్సంబంధాల్లో ఉన్నాయని ఎవరిని బెదిరిస్తున్నారు అంటూ ఆయన ప్రశ్నించారు, కేంద్రంతో కాకపోతే అమెరికా అధ్యక్షుడు తో కూడా సంబంధాలు పెట్టుకోవచ్చని ఈ ప్రభుత్వం ప్రజల పట్ల చిత్తశుద్ధితో ఉందని ఆయన చెప్పుకొచ్చారు.గురువారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉప సంఘం మీటింగ్ లో పాల్గొనటానికి వచ్చిన ఆయన మీటింగ్ అనంతరం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్దీకరణ తేదీలను మార్చమని వస్తున్న విజ్ఞప్తు లను అధ్యయనం చేస్తున్నామని చెప్పిన ఆయన త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపిస్తామని చెప్పుకొచ్చారు.అంతేకాకుండా కారుణ్య నియామకాల విషయం లో కొంత ఆలస్యం జరిగింది అని ఒప్పుకున్న మంత్రి బొత్స( Botsa Satyanarayan) తొందరలోనే ఆ నియామకాలు చేపడతామని చెప్పుకొచ్చారు .పూర్తిస్థాయి సమాచారం తీసుకున్న తర్వాత మాత్రమే కొత్త జోనల్ వ్యవస్థ పై నిర్ణయాలు ఉంటాయని, ఏ ఉద్యోగులు ఏ జిల్లాల లో పని చేయాలన్న దానిపై ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణ లోకి తీసుకునే నిర్ణయాలను ప్రకటిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.తమ రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని వివాదాస్పదం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఇది తాగద ని హితవు పలికారు.







