అక్కడ చికెన్ కొంటే టమాటాలు ఫ్రీ.. పోటెత్తుతున్న జనాలు..

ఇప్పుడు భారతదేశంలో టమాటాలు( Tomatoes ) హాట్ టాపిక్ అయ్యాయి.వీటిపై మీమ్స్ కూడా సోషల్ మీడియాలో బీభత్సం సృష్టిస్తున్నాయి.

 Half Kg Tomatoes Free If You Buy One Kg Chicken In East Godavari Details, Latest-TeluguStop.com

ఇప్పుడు ఎవరి నోట విన్నా ఎక్కువగా టమాటా మాటే వినిపిస్తోంది.టమాటా పేరు చెప్తే పేద, మధ్య తరగతి ప్రజల్లో వణుకు పుడుతుంది.ఎందుకంటే కొద్ది రోజుల క్రితం 10 రూపాయలకే దొరికే కేజీ టమాటా ఇప్పుడు రూ.100 పెట్టినా లభించడం లేదు.కొన్నిచోట్ల టమాటా ధర రూ.200 పైగా పలుకుతుందంటే వీటికి ఎంత డిమాండ్ నెలకొందో అర్థం చేసుకోవచ్చు.

Telugu Strategy, Chicken, Chicken Shop, Latest, Tomato, Tomatoes-Latest News - T

ఇలాంటి నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేందుకు టమాటాను ఆశగా చూపుతున్నారు వ్యాపారస్తులు.తాజాగా ఒక చికెన్ షాప్ ఓనర్ చికెన్ కొంటే టమాటాలు ఫ్రీగా ఇస్తానని ప్రకటించాడు.దాంతో అతడి షాప్ వద్దకు ప్రజలు పోటెత్తుతున్నారు.సాధారణంగా భారతీయులు టమాటాలను చాలా వంటకాల్లో వాడుతుంటారు.ఇవి లేకపోతే ఇబ్బందులు తప్పవు.అందుకే కాస్త డబ్బు ఎక్కువైనా వీటిని కొనుగోలు చేసి కావలసిన వంటకాలు చేసుకుంటున్నారు.

ఈ సమయంలో ఫ్రీగా టమాటాలు( Free Tomatoes ) ఇస్తామని చికెన్ షాప్ ఓనర్ ప్రకటించడంతో చాలామంది ప్రజలు అతని దుకాణం ముందు క్యూ కడుతున్నారు.

Telugu Strategy, Chicken, Chicken Shop, Latest, Tomato, Tomatoes-Latest News - T

వివరాల్లోకి వెళ్తే.తూర్పుగోదావరి జిల్లా,( East Godavari ) ఉండ్రాజవరం మండలం, చివటం ఊరిలో “శ్రీ గణేష్‌ చికెన్‌” ( Sri Ganesh Chicken ) పేరుతో దుకాణదారుడు వనం శ్రీను కొత్తగా చికెన్ షాపు ఓపెన్ చేశాడు.ప్రస్తుతం టమాటాలకు బాగా డిమాండ్ ఉందని అతని గుర్తించాడు.

టమాటాని ఆశగా చూపి ప్రచారం చేసుకోవడానికి ఇంతకంటే మించిన సమయం దొరకదని భావించాడు.అనుకున్నదే తడవగా తమ షాపు వద్ద ఒక కేజీ చికెన్‌ కొంటే అరకేజీ టమాటాలు ఫ్రీగా ఇస్తానని ప్రకటించాడు.

అంతేకాదు ఈనెల అంతటా చికెన్ కొన్నవారికి ఫ్రీగా కూరగాయలు అందిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు.అయితే ఫ్రీగా టమాటాలు వస్తున్నాయని తెలిసి చాలామంది తమ షాపు వద్దకే వస్తున్నారని ఈ దుకాణదారుడు చెబుతున్నాడు.

బిజినెస్ స్ట్రాటజీ సక్సెస్ అయినందుకు అతడు సంతోషిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube