'బేబీ' కి భలే ఛాన్స్... రెండో వారంలోనూ కుమ్ముడే!

కొన్ని సినిమా లు ఎందుకు హిట్ అవుతాయో అర్థం కావు.కొన్ని సినిమా లు ఎందుకు ఫ్లాప్ అవుతాయో కూడా అర్థం కావు.

 Anand Devarakonda Baby Movie Collections ,anand Devarakonda, Baby Movie , Vaishn-TeluguStop.com

అలాంటి సినిమా ల జాబితాలో బేబీ ఒకటి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆనంద్ దేవరకొండ( Anand devarakonda ) హీరోగా వైష్ణవి( Vaishnavi chaitanya ) హీరోయిన్ గా రూపొందిన బేబీ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్న సమయం లోనే సినిమా పై అంచనాలు పెరిగాయి.

పైగా సినిమా కి విభిన్నమైన ప్రమోషన్ చేయడం ద్వారా అందరికి చేరువ అయింది.సినిమా లో ఇద్దరు హీరో లు.ఒక హీరోయిన్ ఉండటంతో కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉండేలా ఉందంటూ టాక్ వినిపించింది.అనుకున్నట్లుగానే కథ విభిన్నంగా ఉండటంతో సినీ అభిమానులు తెగ ఇష్టపడుతున్నారు.

సినిమా మొదటి రెండు మూడు రోజులు భారీ వసూళ్లు సాధిస్తుంది.ఆ తర్వాత సైలెంట్ అవుతుందని అంతా భావించారు.

కానీ బేబీ అలా కాదు.ఇతర సినిమాల మాదిరిగా కాకుండా చాలా విభిన్నంగా వసూళ్లను రాబడుతోంది.

మొదటి మూడు రోజులతో పోల్చితే ఆ తర్వాత మూడు రోజుల వసూళ్లు ఎక్కువగా ఉన్నాయి అంటే ఏ స్థాయి లో సినిమా విజయాన్ని సొంతం చేసుకుందో అర్థం చేసుకోవచ్చు.ఇప్పుడు బేబీ( Baby movie ) కి మరో వారం కలిసి రాబోతుంది.ఈ శుక్రవారం మూడు నాలుగు సినిమా లు విడుదల అవ్వబోతున్నాయి.ఆ మూడు నాలుగు సినిమా ల్లో ఏ ఒక్కటి కూడా మినిమం బాగుంటుంది అనే నమ్మకాన్ని కలిగించలేక పోతున్నాయి.

కనుక బేబీ సినిమా నే వచ్చే వారం కూడా బాక్సాఫీస్ వద్ద దున్నేయడం ఖాయం అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.మొత్తానికి బేబీ సినిమా భలే గా వసూళ్లు రాబడుతున్న నేపథ్యం లో బాక్సాఫీస్ వర్గాల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube