యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) కు ఈ మధ్య కాలంలో రాజకీయాలకు సంబంధించి ప్రశ్నలు ఎదురవుతున్నా తారక్ మాత్రం ఆ ప్రశ్నలకు సంబంధించి స్ట్రెయిట్ గా సమాధానం చెప్పడం లేదు.సమయం, సందర్భం వచ్చినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడతానని చెబుతూ తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సీఎం అంటూ కొన్ని ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నారా లోకేశ్( Nara lokesh ) యువగళం పాదయాత్రలో భాగంగా ఈ ఫ్లెక్సీలు దర్శనం ఇస్తుండగా ఈ ఫ్లెక్సీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగేనంటూ ఒకింత వ్యంగ్యంగా ఉన్న ఈ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.అయితే లోకేశ్ ను టార్గెట్ చేస్తూ కొంతమంది వైసీపీ నేతలు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేస్తున్నారనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు సంబంధించి స్పష్టత ఇస్తే ఫ్యాన్స్ సైతం ఎవరికి సపోర్ట్ చేయాలనే విషయాలకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఎన్టీఆర్ కెరీర్ పై ఫోకస్ పెట్టి కెరీర్ పరంగా ఎదిగే దిశగా అడుగులు వేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.తారక్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు.
అల్లు అర్హకు ఈ సినిమాలో అవకాశం దక్కిందని పది నిమిషాల పాటు ఈ సినిమాలో అర్హ కనిపించనున్నారని టాక్ నడుస్తోంది.తారక్ సినిమాలో అర్హ( Allu Arha ) కనిపిస్తే అర్హ రేంజ్ కూడా మరింత పెరుగుతుంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం క్రేజీ కాంబినేషన్ల దిశగా అడుగులు పడుతున్నాయి.అల్లు అర్హ నటించిన తొలి మూవీ శాకుంతలం సినిమా ఫ్లాప్ కాగా దేవర సినిమా( Devara movie ) ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.