యాదాద్రి భువనగిరి జిల్లా: గుండాల మండలకేంద్రానికి చేరుకోవాలంటే ప్రయాణం కత్తి మీద సాములాగా మారిందని మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.రోడ్లకు నిధులు మంజూరై శంకుస్థాపనలు చేసి రోడ్లు వేయడం మరిచారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.కొమ్మాయిపెళ్లి నుండి రామారం పిడబ్ల్యు రోడ్డు వరకు 198.5 లక్షలు,మోత్కూర్ పిడబ్ల్యు రోడ్డు నుండి తుర్కలశాపురం వరకు 61.28 లక్షలు,గుండాల నుండి నూనెగూడెం వరకు 125 లక్షలు,గుండాల వయా వస్తాకొండూర్ దేవర్పుల క్రాస్ రోడ్డు వరకు 390 లక్షల నిధులు మంజూరు అయినప్పటికీ పనులు ఆలస్యం అవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఇదే విషయాన్ని పంచాయతీ రాజ్ ఏఈ దామోదర్ ( AE Damodar )ను వివరణ కోరగా కొమ్మాయిపల్లి( Kommaipalli 0 గ్రామం నుండి పనులు మొదలయ్యాయని,అతి త్వరలో అన్ని గ్రామాలకు పనులు మొదలు పెడుతున్నామని చెప్పారు.
ప్రజలను మభ్య పెట్టేందుకే రోడ్లకు శంకుస్థాపనలు చేసి రోడ్లు వేయడం లేదని,రెండు పర్యాయాలుగా బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చినా గుండాల మండల అభివృద్ధి చేయడంలో స్థానిక ఎమ్మెల్యే విఫలమయ్యారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెబుతారనిజిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్ అన్నారు.







