సినిమాలలో సక్సెస్ సాధించిన చాలామంది సెలబ్రిటీలు రాజకీయాలలో కూడా సక్సెస్ సాధించాలని భావిస్తుంటారు.అయితే ఈ ప్రయత్నంలో కొంతమంది సక్సెస్ సాధిస్తే ఎక్కువమంది ఫెయిలవుతున్నారు.మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) 15 సంవత్సరాల క్రితం ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు.2009 ఎన్నికల్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ 18 స్థానాలలో విజయం సాధించింది.తిరుపతి నుంచి చిరంజీవి ఎమ్మెల్యేగా గెలిచారు.
అయితే టీడీపీ, కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవడంతో ప్రజారాజ్యం పార్టీకి( Prajarajyam Party ) ఆశించిన ఫలితాలు రాలేదు.
తర్వాత రోజుల్లో వేర్వేరు కారణాల వల్ల మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం జరిగింది.తమిళనాడులో రజనీకాంత్( Rajinikanth ) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావించినా వయస్సు సమస్యల వల్ల ఆయన రాజకీయాలకు దూరం కావాల్సి వచ్చింది.
కమల్ హాసన్( Kamal Haasan ) తమిళ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలని భావించినా ఆయనకు కూడా అనుకూల ఫలితాలు దక్కలేదు.
కన్నడ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలని ఉపేంద్ర( Upendra ) భావించగా ఆయనకు కూడా షాకింగ్ ఫలితాలు ఎదురయ్యాయి.విజయ్ కాంత్( Vijay Kanth ) కూడా రాజకీయాల్లో సంచలనాలు సాధించాలని ప్రయత్నాలు చేసి ఫెయిలయ్యారు.తెలుగులో సైతం కొంతమంది చిన్నాచితకా ఆర్టిస్టులు రాజకీయాల్లో సక్సెస్ సాధించాలని తన వంతు ప్రయత్నాలు చేయగా ఆ ప్రయత్నాలు ఫెయిలయ్యాయి.
మరి కొందరు సినీ నటులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నా ప్రముఖ రాజకీయ పార్టీల నుంచి టికెట్లు దక్కడం లేదు.ప్రస్తుతం కొంతమంది సినీ నటులు రాజకీయాల్లో గెలిచి ఎమ్మెల్యేలుగా కొనసాగుతుండగా రాబోయే రోజుల్లో ఈ సినిమాలు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.మరి కొందరు సినీ నటులు రాజకీయాల్లో భారీ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుండగా ఆ సినీ నటులు రాజకీయాల్లో చరిత్ర సృష్టించడం, చరిత్ర తిరగరాయడం సాధ్యమవుతుందో లేదో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.