టికెట్ల కేటాయింపుల్లో దూకుడు చూపిస్తున్న జనసేన ?

నిన్న మొన్నటి వరకు పట్టుమని పదిమంది నేతలు తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ నేతలు లేని జనసేన పార్టీ( Janasena ) వచ్చే ఎన్నికల్లో పొత్తులో ఎన్ని సీట్లు డిమాండ్ చేస్తుంది అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.కీలక నేతలు, జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపించగలిగిన నేతలు లేకుండా పొత్తులో ఎక్కువ సీట్లు డిమాండ్ చేసినా అవి వృధాగా పోవటం తప్ప ఈ రెండు పార్టీలకు ఉపయోగం ఉండదన్న తరహాలో కొన్ని విశ్లేషణలు కూడా తెలుగుదేశం అనుకూల మీడియా నుంచి రావడం తెలిసిన విషయమే.

 Janasena Showing Aggressiveness In Allotment Of Tickets Details, Janasena Party,-TeluguStop.com

అయితే తన వారాహి యాత్ర( Varahi Yatra ) ద్వారా ప్రజాదరణను గణనీయంగా పెంచుకున్న జనసేన ఇప్పుడు టికెట్ల కేటాయింపు పై దూకుడుగా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది.జనసేనలో చేరడానికి చాలా కాలం నుంచి నేతలు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ ఆచి తూచి స్పందించిన జనసేన ని ఇప్పుడు గేట్లు ఎత్తివేసినట్లుగా తెలుస్తుంది.

Telugu Janasena, Pawan Kalyan, Tangellaudaya, Tv Ramarao, Varahivijaya-Telugu To

తన వారాహి యాత్ర మలి విడత పూర్తయిన ప్రస్తుత తరుణంలో పార్టీ నిర్మాణం పై దృష్టి పెట్టిన పవన్( Pawan Kalyan ) నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలను ప్రకటిస్తూ తనదైన దూకుడు చూపిస్తున్నారు.పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రముఖ టీ- టైమ్ సంస్థల అధినేత తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ను( Tangella Udaya Srinivas ) నియమించిన పవన్ కళ్యాణ్, రాజానగరం కి బత్తుల రామకృష్ణను కొవ్వూరు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ని ప్రకటించినట్లుగా జనసేన ఈ రోజు ప్రకటించింది .అంతేకాకుండా తాజాగా నిన్న పార్టీలో చేరిన ప్రకాశం నేత ఆమంచి స్వాములకు కూడా గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి స్పష్టమైన హామీ ఇచ్చారని తెలుస్తుంది.

Telugu Janasena, Pawan Kalyan, Tangellaudaya, Tv Ramarao, Varahivijaya-Telugu To

మరోపక్క విశాఖ పట్నం వైసిపి ఇన్చార్జ్ వైసీపీకి రాజీనామా చేసి ఈరోజు విజయవాడలోని కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్తో కలిసి సమాలోచనలు చేశారు .ఈ నెల 20వ తారీకున ఆయన తన అనుచర గణం తో పార్టీలో జాయిన్ అవుతారని ,విశాఖపట్నం తూర్పు సీటుపై ఆయనకు హామీ ఇచ్చారని తెలుస్తుంది.ఇవన్నీ పొత్తులో భాగంగా ప్రాథమికంగా అంగీకరించిన నియోజక వర్గాలు కాబట్టే జనసేన దూకుడుగా వెళుతుందని పొత్తు ఒక తుది దశకు వస్తే మిగతా స్థానాలకు కూడా బలమైన అభ్యర్థులను వెతికే పనిలో జనసేన ఉంది అని వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube